ప్రియురాలితో పాటు వరదలలో చిక్కుకున్న స్టార్ సింగర్... చివరకు..

By team teluguFirst Published Jul 19, 2021, 3:27 PM IST
Highlights

 మికా సింగ్ ఓ మిత్రుడు వివాహానికి హాజరై వస్తున్నారు. తెల్లవారు జామున 3గంటల సమయంలో మికా సింగ్ కారు వరద నీటిలో చిక్కుకుంది. దీనితో ఆయన కారు ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. 
 

ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ ఆపదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు ఆయనను ఇబ్బంది నుండి బయపడేశారు. వివరాల్లోకి వెళితే, మికా సింగ్ ఓ మిత్రుడు వివాహానికి హాజరై వస్తున్నారు. తెల్లవారు జామున 3గంటల సమయంలో మికా సింగ్ కారు వరద నీటిలో చిక్కుకుంది. దీనితో ఆయన కారు ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. 


మికా సింగ్ కారు రోడ్డుపై వరద నీటిలో చిక్కుకొందన్న విషయం తెలుసుకున్న స్థానికులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. మికా సింగ్ కారును వరద నీటిలో నుండి బయటికి నెట్టి ఆయన, ఇంటికి చేరేలా చేశారు. తన కారు వరదలో చిక్కుకుందని తెలిసి దాదాపు రెండు వందల మంది వచ్చారని, వాళ్ళ సహాయానికి ధన్యవాదాలు అంటూ మికా సింగ్ తెలియజేశారు. 

మికా సింగ్ తో పాటు ఆయన ప్రేయసి నటి ఆకాంక్ష పూరి కూడా ఉన్నారు. కొన్నాళ్లుగా ఆకాంక్ష పూరి, మికా సింగ్ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ముంబైలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. చెంబూర్ ఏరియాలో వరదకారణంగా మట్టి పెళ్లలు నివాసాలను ముంచెత్తడంతో 22మందికి పైగా మరణించారు. 

click me!