Viral Video: సీరియల్ హీరోపై యూనిట్ దాడి... దుర్భాషలాడుతూ చెంపపై కొట్టిన వైనం!

By Sambi ReddyFirst Published Aug 1, 2022, 5:02 PM IST
Highlights

కన్నడ నటుడు చందన్ పై ఓ సీరియల్ యూనిట్ దాడికి దిగిన వీడియో వైరల్ గా మారింది. అతడు టీం లోని ఓ సభ్యుడితో తప్పుగా ప్రవర్తించాడంటూ... అతన్ని చెంపపై కొట్టడంతో పాట బూతులు తిట్టారు. 
 

కన్నడ బుల్లితెర పరిశ్రమలో నటుడు చందన్(Chandan Kumar) కి మంచి గుర్తింపు ఉంది. చందన్ తెలుగులో శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్ చేస్తున్నాడు. లేటెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా యూనిట్ అతడిపై దాడికి దిగారు. పది మంది అతన్ని చుట్టుముట్టి దుర్భాషలాడటం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. నువ్వేమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా అంటూ చందన్ ని దుర్భాషలాడారు. యూనిట్ లో ఓ సభ్యుడు చందన్ ని చెంపపై కొట్టాడు. చందన్.. నన్ను తిట్టాడంటూ ఆరోపించగా.. అతనికి సారీ చెప్పాలని అక్కడ ఉన్నవాళ్లు డిమాండ్ చేశారు. దానికి చందన్ సారీ చెప్పడం జరిగింది. 

మొత్తం ఈ సంఘటనపై మీడియా ముఖంగా చందన్ వివరణ ఇచ్చాడు. అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాము. నిద్ర లేక బాగా అలసిపోయిన నేను అసిస్టెంట్ డైరెక్టర్ కి ఓ ఐదు నిమిషాల తర్వాత వస్తానని డైరెక్టర్ తో చెప్పమని అన్నాను. నేను చెప్పింది ఎలా మిస్ కమ్యూనికేట్ అయ్యిందో తెలియదు. తర్వాత టీమ్ తనపై దాడికి దిగారు. అయితే ఇవేమి నేను మనసులో పెట్టుకోను. ఇది వరకు మాదిరి నా పని నేను చేసుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తానని చందన్ చెప్పుకొచ్చారు. 

కన్నడ సీరియల్ నటుడు చందన్ పై దాడి దృశ్యాలు pic.twitter.com/xewQ76Q4nA

— Asianetnews Telugu (@AsianetNewsTL)

శ్రీమతి శ్రీనివాస్ సెట్స్ లో చందన్ పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో చందన్ తప్పు ఉన్నప్పటికీ లేనప్పటికీ అతని పట్ల యూనిట్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. బూతులు తిట్టడం, కొట్టడం చేయడం నిజంగా అమానుషం. చిన్న నటుడైనంత మాత్రాన ఆ స్థాయిలో అవమానపరచడం నిజంగా సహించరానిది. 
 

click me!