ప్రతిసారి ఆ 10 మందికే ఇబ్బంది.. నేరముంటే శిక్ష వేయండి: డ్రగ్స్ కేసుపై తమ్మారెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 26, 2021, 5:03 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణ జరిగినప్పుడల్లా ఆ 10 మందే ఇబ్బందిపడతారని.. ఆ తర్వాత మళ్లీ మామూలేనంటూ తమ్మారెడ్డి అన్నారు. విచారణలో ఆరోపణలు నిజమైతే శిక్ష వేయాల్సిందేనని.. ఆయన అన్నారు. డ్రగ్స్ కేసును ఇప్పటికైనా త్వరగా తేల్చాలన్నారు. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో డ్రగ్ పెడలర్స్ వుండరు.. యూజర్స్ ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విచారణ జరిగినప్పుడల్లా ఆ 10 మందే ఇబ్బందిపడతారని.. ఆ తర్వాత మళ్లీ మామూలేనంటూ తమ్మారెడ్డి అన్నారు. విచారణలో ఆరోపణలు నిజమైతే శిక్ష వేయాల్సిందేనని.. ఆయన అన్నారు. డ్రగ్స్ కేసును ఇప్పటికైనా త్వరగా తేల్చాలన్నారు. 

కాగా, ఈడీ 10మంది టాలీవుడ్ ప్రముఖులతో పాటు మొత్తం 12మందికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. 2017లో  డ్రగ్స్ వినియోగం లేదా అమ్మకాలు, కొనుగోళ్ళకు పాల్పడుతున్నారనే అభియోగాలపై పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందు, సుబ్బరాజు, నవదీప్ లకు నోటీసులు జారీచేశారు. విచారణ అనంతరం వీరి నుండి సాంపిల్స్ సేకరించి శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్ల కోసం టెస్ట్స్ కి పంపించారు. 

Also Read:బాలీవుడ్ టు టాలీవుడ్.. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతిసారి రకుల్ పేరు.. నిజంగా ఆమె డ్రగ్ అడిక్టా?

మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్‌... 11 కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో ఎక్కడా సినీ రంగానికి చెందిన వారిని నిందితులుగా చేర్చలేదు. తాజాగా హీరో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు జోడించి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. 

click me!