సినిమాలతో బిజీగా వున్నా.. రెండు పడవల మీద కాలు వేయను: ‘‘ మా ’’ఎన్నికల్లో పోటీపై సుమన్ స్పందన

By Siva KodatiFirst Published Sep 12, 2021, 6:38 PM IST
Highlights

‘‘మా ’’ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను సీనియర్ నటుడు సుమన్ ఖండించారు. నెల్లూరులో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన మా ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. 

‘‘మా ’’ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను సీనియర్ నటుడు సుమన్ ఖండించారు. నెల్లూరులో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన మా ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం సినిమాల పరంగా బిజీగా వున్నానని.. రెండు పడవల మీద కాలుపెట్టడం నాకిష్టం లేదని సుమన్ తేల్చిచెప్పారు. డ్రగ్స్ ఒక్క సినీ రంగంలోనే కాదని, అన్ని చోట్లా వున్నాయని ఆయన తెలిపారు. వివిధ కారణాలతో డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని సుమన్ అభిప్రాయపడ్డారు. సినీ ఫీల్డ్‌కు సంబంధించినవి మాత్రమే ఎక్కువ పబ్లిసిటీ అవుతాయని ఆయన చెప్పారు. కఠిన శిక్షలు అమలయ్యే వరకు ఇవి ఇలాగే కొనసాగుతాయని సుమన్ పేర్కొన్నారు.

కాగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులంతా షురూ చేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారు.. ఎవరికివారు వారి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్ 'మా' కళాకారులను విందుకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

click me!