'RX100' హీరోకి క్రేజీ ఆఫర్!

First Published Aug 4, 2018, 1:21 PM IST
Highlights

కబాలి సినిమాను నిర్మించిన ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ 'వి క్రియేషన్స్' వారు కార్తికేయతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథాచర్చలు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారని అంటున్నారు. 

రామ్ గోపాల్ వద్ద శిష్యరికం చేసిన అజయ్ భూపతి దర్శకుడిగా రూపొందించిన సినిమా 'RX100'. ఈ సినిమాతో హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో దర్శకుడు అజయ్ కి టాప్ ప్రొడక్షన్స్ ను అవకాశాలు వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆయన ఇప్పటివరకు ఏ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. హీరోయిన్ పాయల్ ఇప్పటికే సి.కళ్యాణ్ నిర్మాణ సంస్థలో సినిమా చేయడానికి సైన్ చేసిందని సమాచారం. ఇక హీరో కార్తికేయకు కూడా మంచి ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. కబాలి సినిమాను నిర్మించిన ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ 'వి క్రియేషన్స్' వారు కార్తికేయతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కథాచర్చలు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారని అంటున్నారు. టి.ఎన్.కృష్ణ అనే తమిళ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇది కేవలం తమిళంలోనే రూపొందిస్తారా..? లేక తెలుగులో కూడా తెరకెక్కిస్తారా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. 
 

click me!