అది బోగస్‌ ప్రచారం..ఫ్యాన్స్ ఉరేసుకోవాలి.. రియా లాయర్‌ షాకింగ్‌ కామెంట్‌

By Aithagoni RajuFirst Published Oct 6, 2020, 2:29 PM IST
Highlights

రియా చక్రవర్తి లాయర్‌ తాజాగా షాకింగ్‌ కామెంట్‌ చేశారు. `జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌` అనే యాష్‌ ట్యాగ్‌ ఓ బోగస్‌ అని మండి పడ్డారు.

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ప్రధాన నింధితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి లాయర్‌ తాజాగా షాకింగ్‌ కామెంట్‌ చేశారు. `జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌` అనే యాష్‌ ట్యాగ్‌ ఓ బోగస్‌ అని మండి పడ్డారు. సుశాంత్‌ని హత్య చేశారనే ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో ఎయిమ్స్..సుశాంత్‌పై హత్య జరగలేదని తెలిపిన విషయం తెలిసిందే. 

దీన్ని దృష్టిలో పెట్టుకుని రియా చక్రవర్తి లాయర్‌ సతీష్‌ మనేషిండే స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాలో ఆయన మాట్లాడుతూ, `ఈ కేసులో సీబీఐ విచారణ కొలిక్కి వచ్చేంత వరకు అసలేం జరిగిందనేదానిపై వెచి చూడాలి. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే ముంబయి పోలీసులపై, ఎయిమ్స్ వైద్యులపై కొంత మంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకు నచ్చిన సమాధానం రాకపోవడంతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు` అని అన్నారు. 

ఆయన ఇంకా చెబుతూ, `సుశాంత్‌కి న్యాయం చేయాలంటూ ఉద్యమం చేస్తున్న వాళ్లది ఓ బోగస్‌ ప్రచారం. మీలాంటి వాళ్ళంతా సిగ్గుతో తలచు ఉరేసుకోవలి. ఎందుకంటే మీ నటుడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందన్న విషయం బయటకు వచ్చింది. అతడి కుటుంబం వల్ల, మీడియా సృష్టించిన అసత్య ప్రచారాల వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి వాళ్ళంతా సిగ్గుతో ఊరేసుకోవాలి` అని తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన కామెంట్‌ చేశారు. 

జూన్‌ 14న ముంబయిలోని బాంద్రాలోగల తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం  తెలిసిందే. అయితే ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అనే ఆరోపణలు వచ్చాయి. ఆత్మహత్య వెనకాల నెపోటిజం, మాఫియా, డ్రగ్స్ మాఫియా సంబంధాలున్నాయని, అలాగే ఆయన ప్రియురాలు రియానే కావాలని ఇలా చేసిందని ఆరోపణలు వచ్చాయి. రియాని అరెస్ట్ చేసి విచారించగా, డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో దీపికా, రకుల్‌, శ్రద్ధ కపూర్‌, సారా అలీ ఖాన్‌ వంటి పేర్లు వెల్లడయ్యాయి. వీరిని ఇప్పటికే ఎన్‌సీబీ అధికారులు విచారించారు. ప్రస్తుతం సుశాంత్‌ కేసుని సీబీఐ డీల్‌ చేస్తుంది. 

click me!