రియల్ హీరోకి క్యూట్‌ రిక్వెస్ట్‌.. సోనూ అంకుల్‌ విన్నావా?

By Satish ReddyFirst Published Jun 2, 2020, 11:50 AM IST
Highlights

సోనూ అంకుల్‌ అంటూ ఓ చిన్నారి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చిన్నారి `సోనూ అంకుల్‌.. మీరు అందరిని ఇళ్లకు పంపిస్తున్నారని విన్నాను. నాన్న అమ్మను నాని వాళ్ల ఇంటికి పంపమని అడుగుతున్నారు. పంపుతారా` అంటూ చెప్పింది.

కరోనా సమయంలో సినీ పెద్దలు కూడా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. చాలా మంది స్టార్స్‌ కేవలం డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకోగా మరికొందరు మాత్రం తామే స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్‌ స్టార్ విలన్‌ సోనూ సూద్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. తెర మీద విలనిజం పండించే సోనూ రియల్‌ లైఫ్ లో మాత్రం రియల్‌ హీరో అనిపించుకున్నాడు. వేల మంది వలస కార్మీకులను స్వస్థలాలకు చేర్చేందుకు ఎంతో శ్రమిస్తున్నాడు సోనూ సూద్‌.

ఈ నేపథ్యంలో ఆయన కృషిని గుర్తించిన అభిమానులతో పాటు కేంద్ర మంత్రులు కూడా సోనూపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ముంబైలోని వారిని ఆదుకోవటమే కాదు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన వారిని కూడా ఆదుకునేందుకు సోనూ చేస్తున్న కృషి ఎంతో గొప్పది. అందుకే ఆయన్ను స్వాతంత్ర్య సమరయోధులతో పోలుస్తూ కీర్తిస్తున్నారు.

అయితే తాజాగా సోనూ సూద్‌కు సోషల్ మీడియా ద్వారా ఓ క్యూట్ రిక్వెస్ట్ చేసింది ఓ చిన్నారి. సోనూ అంకుల్‌ అంటూ ఓ చిన్నారి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చిన్నారి `సోనూ అంకుల్‌.. మీరు అందరిని ఇళ్లకు పంపిస్తున్నారని విన్నాను. నాన్న అమ్మను నాని వాళ్ల ఇంటికి పంపమని అడుగుతున్నారు. పంపుతారా` అంటూ చెప్పింది. ఈ వీడియోను వెరీ వెరీ అర్జెంట్ డిమాండ్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఓ అభిమాని.

Very Very Urgent Demand ,So Kindly Notice And Please Fulfill The Same !!!! pic.twitter.com/xtDGfE3Kkx

— ChintanDesai (@chintandesai)
click me!