డాన్స్ షోకు హోస్ట్ గా రామ్ చరణ్

By Surya PrakashFirst Published Oct 6, 2020, 8:41 AM IST
Highlights

ఈ ఆన్ లైన్ టాలెంట్ షోకు రామ్ చరణ్ సైతం తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.


రామ్ చరణ్,  ప్రముఖ కొరియోగ్రాఫర్ -ఫిల్మ్ మేకర్-యాక్టర్ ప్రభుదేవా, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ డిజిటల్   డాన్స్ షోను నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ షో కేవలం దివ్యాంగుల కోసం. "హీల్ యుఆర్ లైఫ్ త్రూ డాన్స్" పేరుతో, ఈ కరోనా కష్ట సమయాల్లో దివ్యాంగులు మానసికంగా ధృడంగా తయారు కావటం కోసం.. వారిని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. వారిలో పాజిటివ్ థింకింగ్ ని ప్రేరించటానికి ఈ షోను వేదికగా చేయటనున్నారు. 

రామ్ చరణ్  భార్య ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు చూసుకుంటూనే  ఈ తరహా సామాజిక
కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె తాజాగా యువర్ లైఫ్ పేరుతో ఒక ఆన్ లైన్ వెబ్ సైట్ మొదలుపెట్టారు. అందులో స్టార్ నటి సమంతతో కలిసి బాడీ, మైండ్, హీల్, పోషకాహారం అనే నాలుగు ముఖ్యమైన అంశాల గురించి అనేక విషయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. అంతేకాదు కరోనా జాగ్రత్తలను కూడ వివరిస్తూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

అందులో భాగంగానే ‘మన ఊరు మన బాధ్యత’ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి దాని లోకల్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.  దివ్యాంగుల్లో ఉన్న డ్యాన్స్ టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయడానికి
హీల్ యువ లైఫ్ త్రు డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆన్ లైన్ టాలెంట్ షోకు రామ్ చరణ్
తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
ఆయనతో పాటే ప్రముఖ కొరియోగ్రఫర్లు ప్రభుదేవా, ఫరాఖాన్ సైతం షోలో పాల్గొంటారు.  

రామ్ చరణ్ మాట్లాడుతూ..  మన దేశం  టాలెంట్ ఉన్న వ్యక్తులతో నిండి ఉంది, వారు జీవితం వారిపై విసిరిన అడ్డంకులను ఒక సవాలుగా తీసుకొని విజేతలుగా ఎదగాలని మేము కోరుకుంటున్నాము. ఈ షోలో అసాధారణ ప్రతిభావంతులైన వ్యక్తులని కలిస్తాము.   ఈ షోలో పాల్గొనేవారికి మరియు ప్రేక్షకులకు మోటివేటింగ్ ఎక్సపీరియన్స్ గా ఉంటుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను "అని రామ్ చరణ్ అన్నారు.

 అలాగే 'ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవటానికి' హీల్ యువర్ లైఫ్ థ్రూ డ్యాన్స్ 'ఒక రిమైండర్ . డ్యాన్స్ మన ఆలోచనలలో చాలా పాజిటివిటీని తెస్తుంది మరియు రోజువారీ ఎదుర్కొనే అనేక సమస్యలనుంచి,హార్డ్ రియాలిటీ నుండి ఏర్పడే మానసిక గాయాల నుంచి  నయం చేస్తుంది "అని రామ్ చరణ్ అన్నారు.

click me!