జక్కన్న స్టెప్పులు చూస్తే షాకవ్వాల్సిందే!

By Prashanth MFirst Published Jan 1, 2019, 5:31 PM IST
Highlights

దర్శకదీరుడు రాజమౌళికి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసనీ అతని కుమారుడి పెళ్లితో చెప్పకనే చెబుతున్నాడు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు రావడంతో కొంచెం డీసెంట్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. 

దర్శకదీరుడు రాజమౌళికి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసనీ అతని కుమారుడి పెళ్లితో చెప్పకనే చెబుతున్నాడు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు రావడంతో కొంచెం డీసెంట్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. బాలీవుడ్ ప్రెస్ మీట్ లకు వెళితే అడుగులో కూడా తేడా ఉండడకూడదు. వాటన్నిటిలో జక్కన్న ఇంతవరకు బాగానే నడుచుకున్నాడు. 

అయితే తనయుడి వివాహ వేడుకలో మాత్రం చిన్న పిల్లాడిలా మారిపోయి చిందులేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. జక్కన్నా వర్క్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటాడో హ్యాపీ మూమెంట్ లో కూడా అంతే సరదాగా ఉంటాడని నిరూపిస్తున్నాడు. జగపతి బాబు సోదరుడి కుమార్తెకు - జక్కన్న కొడుకు కార్తికేయ కు రీసెంట్ గా రాజస్థాన్ లో హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది. 

అయితే డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం రాజస్థానీ తరహాలో ధరించి చిందులేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా జక్కన్న స్టెప్పులపై ఓ లుక్కేయండి. 

click me!