నోటీసులు వచ్చినోళ్లంతా ఖండిస్తున్నారు.. మరి పూరీ, రవితేజ, ఛార్మి ఎక్కడ

First Published Jul 14, 2017, 8:32 PM IST
Highlights
  • టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ సిట్ నోటీసులు
  • నోటీసులు అందుకున్న వారిలో పూరీ,రవితేజ, చార్మి తదితరులు
  • ఇప్పటికే నవదీప్, సుబ్బరాజు, నందు, తరుణ్, ముమైత్ ఖండన
  • ఇంత జరుగుతున్నా కొందరు ఖండన ఇవ్వకపోవడంతో అనుమానాలు

డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. కేసులో పట్టుబడ్డ నిందితుడు కెల్విన్ విచారణలో వెల్లడైన వాస్తవాలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ తెలుగు సినీ హీరో రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, ఐటమ్ గాళ్ ముమైత్ ఖాన్, హీరోలు తరుణ్, నవదీప్,తనీష్, సుబ్బరాజు, నందు తదితరులతోపాటు సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా,శ్రీనివాసరాజులకు నోటీసులు అందాయి. వీరిలో కొందరి తమపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తుంటే.. మరి కొంత మంది మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధపడగా, పోలీసులు నిలువరించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దీనిపై స్పందించిన నవదీప్, సుబ్బరాజు, తనీష్, నందు, తరుణ్ లు తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని మీడియా ముఖంగా వెల్లడించారు. ప్రముఖ గాయని భర్త, వర్ధమాన హీరో నందు అయితే ఏకంగా తనను పిలిచిన తేదాకన్నా ముందుగానే.. ఇవాళ నేరుగా వెళ్లి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో తన పేరు ఎందుకు వచ్చిందో చెప్పాలని అధికారులను కోరాడు. ఇక తాను ఎలాంటి విచారణ కైనా సిద్ధమని, తన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని విచారించినా రెడీ అని సవాల్ చేశాడు.

మరోవైపు నవదీప్ కూడా తనపట్ల మీడియా సాఫ్ట్ కార్నర్ ఎక్కువైందని వాపోయాడు. తనను కార్నర్ చేస్తున్నారన్నాడు. నిందితుడి వద్ద తన ఫోన్ నంబర్ ఉండటానికి కారణాలు వేరని, తాను ఈవెంట్స్ నిర్వహిస్తుంటానని, దాని వల్ల తన కాంటాక్ట్ షేర్ చేసుకుని ఉంటాను తప్ప తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నాడు. తరుణ్ కూడా తనపై డ్రగ్స్ వినియోగం ఆరోపణలు మనస్థాపానికి గురిచేశాయని అన్నాడు.

మరోవైపు ఛార్మి కూడా ఇన్ స్టా గ్రామ్ లో ఓ కోట్ పెట్టేసింది. మనల్ని కిందికి లాగాలని ఎవరైనా చూస్తున్నారంటే మనం వారికంటే పై స్థాయిలో వున్నామనే దానర్థం అంటూ మీనింగ్ వచ్చే కోట్ ఒకటి పోస్ట్ చేసింది ఛార్మి.

ఇలా పరిశ్రమకు సంబంధించిన అందరూ తమకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. దీనిపై పూరీ, రవితేజ లాంటి టాప్ సెలెబ్రిటీల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. దీనికి సంబంధించి మీడియా సంస్థల ప్రతినిధులు సంప్రదించే ప్రయత్నం చేసినా వాళ్లు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా ఓ ఇద్దరు ప్రముఖ టాలీవుడ్ సెలెబ్రిటీలు విచారణకు హాజరు కాకుండా బ్యాంకాక్ వెళ్లే ప్రయత్నం చేశారని, పోలీసులు వారిని నిలువరించారని తెలుస్తోంది.

click me!