'భీమ్లా నాయక్' థియేటర్ రిలీజ్, ఓటిటి రిలీజ్ కి నెల గ్యాప్.. అమెజాన్ బిగ్ డీల్ ?

By telugu teamFirst Published Aug 29, 2021, 9:32 PM IST
Highlights

ప్రస్తుతం థియేటర్ బిజినెస్ డల్ గా సాగుతుండడంతో ఓటిటి సంస్థలు పండగ చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాలని సైతం నేరుగా ఓటిటిలో రిలీజ్ చేసేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నారు.

ప్రస్తుతం థియేటర్ బిజినెస్ డల్ గా సాగుతుండడంతో ఓటిటి సంస్థలు పండగ చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాలని సైతం నేరుగా ఓటిటిలో రిలీజ్ చేసేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నారు. డైరెక్ట్ రిలీజ్ కుదరకపోతే థియేటర్ రిలీజ్ కు కొంత గ్యాప్ తర్వాత స్ట్రీమ్ చేసుకునేందుకు డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంటున్నాయి. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్ప్స్ కి థండర్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ లుంగీ గెటప్ లో కేక పెట్టించేలా కనిపించారు. 

సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్ ప విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. సంక్రాంతికి భీమ్లా నాయక్ థియేటర్స్ లో సందడి చేయనుంది. జనవరి 12న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్ర ఓటిటి హక్కులు సొంతం చేసుకునేందుకు అమెజాన్ సంస్థ బిగ్ డీల్ తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

భీమ్లా నాయక్ థియేటర్స్ లో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటిటిలో రిలీజ్ చేసేందుకు అమెజాన్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ అమౌంట్ ని కూడా ఆఫర్ చేశారట. 

పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. రానాకి జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 

click me!