అతడు రేప్ చేయలేదు.. ఇద్దరూ సహజీవనం చేశారు.. నటుడికి మద్దతు!

By AN TeluguFirst Published May 9, 2019, 2:25 PM IST
Highlights

ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ ఓ యువతిని రేప్ చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్న కారణంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ ఓ యువతిని రేప్ చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్న కారణంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కరణ్ పై ఐపీసీ సెక్షన్ 376, 384 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.మోడల్, నటుడు అయిన కరణ్ పెళ్లి పేరుతో సదరు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, అంతేకాకుండా సదరు యువతి అభ్యంతరకర  ఫోటోలను, వీడియోలను బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే ఈ కేసులో నటుడు కరణ్ ఒబెరాయ్ కి మద్దతుగా నిలిచింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూజా బేడీ. కరణ్ పై అత్యాచారం కేసు పెట్టిన మహిళ అత్యాచార చట్టాన్ని  దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మహిళలు శక్తివంతంగా, ధృడంగా ఉండాలని, మహిళా హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని తాను ఎప్పటినుండో వాదిస్తున్నట్లు.. ఇకపై పురుషుల హక్కులు 'మెన్ టూ మూమెంట్' కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది.

మహిళలపై అత్యాచారం, దోపిడీలను నివారించడానికి ఏర్పాటు చేసిన చట్టాలను కొందరు స్త్రీలు దుర్వినియోగం చేస్తున్నారని కామెంట్ చేసింది. తమ వ్యక్తిగత కక్ష, ప్రతీకారాల  కోసం వాడుకున్నారని ఆరోపించింది. తన స్నేహితులు కరణ్ తో కలిసి జీవించిన మహిళ ఇప్పుడు అతడిపై అత్యాచార కేసు ఫైల్ చేసిందని, దాని కారణంగా అతడి కెరీర్ నాశనమైందని, కుటుంబం ఎంతో క్షోభను అనుభవిస్తోందని తెలిపింది.

సమాజంలో కొందరు స్త్రీల కారణంగా పురుషులు కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారని 'మెన్ టూ మూమెంట్' మొదలు కావడానికి సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు. 

యువతిని రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోన్న నటుడు!

రేప్ కేసు.. కోర్టులోనే ఏడ్చేసిన నటుడు!

click me!