ఓ మహిళను పెళ్లి పేరుతో మోసం చేసి ఆమెపై అసభ్యకర వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్న టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ నిపోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నాడు న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా తీవ్ర  మనస్థాపానికి గురైన కరణ్ కోర్టు హాలులోనే ఒక్కసారిగా బోరున విలపించాడు.

తనపై అత్యాచారం చేసి దాన్ని వీడియో చిత్రీకరించి డబ్బు డిమాండ్ చేస్తున్నాడని, డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను ఆన్ లైన్ లో పెడతానంటూ బెదిరిస్తున్నాడని కరణ్ పై ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

బాధితురాలు 'జస్సీ జైసే కోయి నహీ' అనే సీరియల్ నటిస్తున్నప్పటి నుండి కరణ్ తో పరిచయం ఏర్పడింది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కరణ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై అత్యాచారం, దోపిడీ కేసులతో పోలీసులు అరెస్ట్ చేశారు. 

యువతిని రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోన్న నటుడు!