రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి దర్శకులుగా మారిన వారు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే అందులో కొందరు ఇప్పటికి కూడా స్క్రిప్ట్ విషయంలో ఎవరి సాయం తీసుకోరు. త్రివిక్రమ్ అలాంటి వారిలో మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఆయన అజ్ఞాతవాసి వరకు ఎవరి సాయాన్ని కోరలేదు.

స్క్రిప్ట్ విషయంలో సహాయక దర్శకులతో మాట్లాడతారే గాని మరో పెన్ను చేరడానికి ఇష్టపడరు. కానీ అరవింద సమేత సినిమా కోసం మాత్రం ఒక వ్యక్తి సాయం చాలానే తీసుకున్నట్లు తెలిపారు. అతను ఎవరో కాదు. నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారి చూడు మామ అనే పాట పాడిన పెంచల్ దాస్. త్రివిక్రమ్ ఇటీవల అతని గురించి వివరించాడు.
undefined
అరవింద సమేత రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని అక్కడి భాషను కరెక్ట్ గా ఆకట్టుకునే విధంగా తెరపై చూపించాలని మాటల మాంత్రికుడు పెంచల్ దాస్ సహకారాన్ని తీసుకున్నాడట. దాదాపు షూటింగ్ మొత్తంలో అతడు ఉన్నాడని రాయలసీమ పరిస్థితులపై అలాగే మాటల విషయంలో ఎంతో సహాయాన్ని అందించినట్లు వివరించారు.
అదే విధంగా డబ్బింగ్ జరిగేటప్పుడు కూడా పెంచల్ ఉన్నట్లు తెలుపడంతో త్రివిక్రమ్ మొదటిసారి సినిమాను కరెక్ట్ గా ప్రజెంట్ చేయడం కోసం ఒకరి సాయం తీసుకున్నట్లు చెప్పవచ్చు..ఇక అరవింద సమేత ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్
'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?
తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?
రెడ్డి ఇక్కడ సూడు.. సాంగ్ కోసం రెడీగా ఉండండి!
అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!
అరవింద సమేత ఫొటో కార్డ్ డిజైన్స్ (ఫొటోలు)
అరవింద సమేత: తారక్ పాత్ర గురించి త్రివిక్రమ్ కామెంట్!