హాస్పిటల్ లో చేరిన సీనియర్ నటుడు దిలీప్ కుమార్!

Published : Oct 08, 2018, 03:41 PM IST
హాస్పిటల్ లో చేరిన సీనియర్ నటుడు దిలీప్ కుమార్!

సారాంశం

వెటరన్ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ని గత రాత్రి హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. శ్వాసకోస సంబధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయనకి నిమోనియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

వెటరన్ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ని గత రాత్రి హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. శ్వాసకోస సంబధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయనకి నిమోనియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం దీనికి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయాన్ని దిలీప్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైసల్ ఫరోకి వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం కూడా ఆయన అస్వస్థతకి గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

ఆయన తిరిగి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసి ఓ నర్సు సహాయంతో ఇంట్లోనే ట్రీట్మెంట్ అందించారు. కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలిన ఆయన 1998లో సినిమాలకు దూరమయ్యారు.

ఆయన నటించిన ఆఖరి సినిమా 'కిలా'. బాలీవుడ్ లో 'ట్రాజెడీ కింగ్'గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇండియా సినిమాలోనే సూపర్ స్టార్ గాఎదిగారు.

సంబంధిత వార్త.. 

సీనియర్ నటుడు దిలీప్ కుమార్ కి అస్వస్థత!

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?