ఎన్టీఆర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు!

Published : Oct 09, 2018, 04:46 PM IST
ఎన్టీఆర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు!

సారాంశం

ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో విపరీతమైన ఆదరణ దక్కింది. 

ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో విపరీతమైన ఆదరణ దక్కింది.

దీని వెనుక ఎన్టీఆర్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారని సమాచారం. సాధార‌ణంగా ఒక హీరో అభిమానులు మ‌రో హీరోను ప‌ట్టించుకోరు. వాళ్ల సినిమాలను ప్రోత్సహించరు. కానీ ఎన్టీఆర్ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆలోచన భిన్నంగా ఉంది. 

ఎన్టీఆర్ ని కూడా ప్రేమిస్తామంటూ పవన్ అభిమానులు 'అరవింద సమేత' ట్రైలర్ ని తెగ షేర్ చేసి లైకులు కొట్టారు. చాలా మంది పవన్ అభిమానులు ఎన్టీఆర్ కి విషెస్ చెబుతూ సినిమా సక్సెస్ అవ్వాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం ఊరూరా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

పవన్ తో పాటు ఎన్టీఆర్ దిగిన ఫోటోలతో ఫ్లెక్సీ చేయించి థియేటర్ల దగ్గర పెడుతున్నారు. సాధారణంగా మెగా ఫ్యాన్స్ కి, నందమూరి ఫ్యాన్స్ కి పెద్దగా పొసగదు కానీ తారక్  విషయంలో మెగా ఫ్యాన్స్ పాజిటివ్ గా ఉండడమనే విషయం అతడి మంచితనానికి, గోప్పతనానికి అద్దం పడుతోంది.   

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటంటే..?

కళ్యాణ్ రామ్ తల్లి గురించి ఎన్టీఆర్ ఏమన్నాడంటే..?

'అరవింద సమేత'పై రన్ టైమ్ ఎఫెక్ట్..?

ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?