గీతామాధురికి హీరోయిన్ ఛాన్స్..!

Published : Oct 09, 2018, 04:17 PM ISTUpdated : Oct 09, 2018, 04:29 PM IST
గీతామాధురికి హీరోయిన్ ఛాన్స్..!

సారాంశం

సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది గీతామాధురి. తన గాత్రంతో ఎందరినో అలరించిన గీతా ఇప్పుడు నటిగా మారడానికి సిద్ధమవుతోంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత గీతామాధురికి బయట క్రేజ్ బాగానే పెరిగింది.

హౌస్ లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా భరతమాత అవతారమెత్తి ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఆ టాస్క్ చూసిన వారు కూడా 'అరెరె గీత ఇంత బాగా నటిస్తుందా..?' అనుకున్నారు. హోస్ట్ నాని కూడా సినిమాల్లోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా..? అని గీతాని అడిగారు.

ఆ సమయంలో అలాంటిదేమీ లేదని చెప్పిన గీతామాధురి త్వరలోనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ యాక్షన్, థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం రావడంతో గీతా ఓకే చెప్పేసిందట. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలుకానుందని సమాచారం.

సినిమాలలో నటించినంత మాత్రం పాటలు పాడడం ఆపనని గీతామాధురి చెబుతోంది. మంచి కథ తన దగ్గరకి రావడంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

13 కోట్ల వాచ్, 60 ఏళ్ల వయసులో 7300 కోట్ల ఆస్తి, ఇండియాలోనే రిచ్ హీరో ఎవరో తెలుసా?
Age Gap: మన స్టార్ హీరోలకు వారి భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?