విశ్వక్ సేన్ సినిమాకు క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్.. గ్రాండ్ గా పూజా కార్యక్రమం..

By team teluguFirst Published Jun 23, 2022, 11:14 AM IST
Highlights

యంగ్ హీరో విశ్వక్ సేన్, యాక్షన్ కింగ్ అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వక్ సేన్11’.  ఈ చిత్ర ముహూర్తం, పూజా కార్యక్రమాన్ని ఈ రోజు గ్రాండ్ గా నిర్వహించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. 
 

రొటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) తన తదుపరి చిత్రాన్ని పెద్ద లెవల్ లోనే ప్లాన్ చేసుకున్నాడు. ‘ఏమైందీ నగరానికీ’, ‘ఫలక్‌నూమాదాస్‌’ చిత్రాలతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యంగ్‌ హీరో ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. గతేడాది `హిట్‌`.. తాజాగా  ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. అదే జోష్ లో మిగితా సినిమాలను కూడా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

విశ్వక్ సేన్ ఇప్పటికే నాలుగైదు చిత్రాల్లో నటిస్తుండగా.. తన తదుపరి చిత్రం ‘విశ్వక్ సేన్11’ (Vishwak Sen11)ను యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో చేయనున్నట్టు ప్రకటించాడు. ఇటీవల ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు చిత్ర ముహూర్తం మరియు పూజా కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమాను ప్రారంభిస్తూ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో మాట్లాడి, ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న హీరోల సినిమా ఫంక్షన్లు, చిత్ర కార్యక్రమాలకు హాజరవుతుండటం విశేషం. యంగ్ హీరోలను పవణ్ కళ్యాణ్ ఇలా సపోర్ట్ చేయడం పట్ల సినీ పెద్దలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

విశ్వక్ సేన్ 11 మూవీలో విశ్వక్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ గా అర్జున్ కూతూరు ఐశ్వర్య అర్జున్ నటిస్తోంది. శ్రీ రామ ఫిల్మ్స్ బ్యానర్ పై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
 
ఇక `అశోకవనంలో అర్జున కళ్యాణం` మూవీ విజయవంతం తర్వాత విశ్వక్  తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టాడు. ‘గామి, అక్టోబర్  31 లేడీస్ నైట్, ఓరి దేవుడా, దాస్ కా దమ్కీ, ముఖ చిత్రాల్లో  నటిస్తున్నారు. ఈ చిత్రాల్లో కొన్నింటి చిత్రీకరణను పూర్తి చేసిన  విశ్వక్, మిగతా వాటిని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. 

 

Power Star graced - film Muhurtham & Pooja Ceremony

Mass Ka Dass , starrer in direction launched today pic.twitter.com/HkSEOxmsN4

— Vamsi Kaka (@vamsikaka)
click me!