'హుషారు' వంటి యూత్ సినిమాలు ఇప్పుడు తెలుగునాట బాగా ఆడుతున్నాయి. కథలో కొత్తదనం, విభిన్నమైన టైటిల్ ఉంటే ఆ సినిమాలో ఆర్టిస్ట్ లు ఎవరైనా, బ్యానర్ ఏదైనా, దర్శకుడు కొత్తైనా జనం ఆదరిస్తున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్ గా వచ్చి హిట్టైన ఆర్.ఎక్స్ 100.
హుషారు' వంటి యూత్ సినిమాలు ఇప్పుడు తెలుగునాట బాగా ఆడుతున్నాయి. కథలో కొత్తదనం, విభిన్నమైన టైటిల్ ఉంటే ఆ సినిమాలో ఆర్టిస్ట్ లు ఎవరైనా, బ్యానర్ ఏదైనా, దర్శకుడు కొత్తైనా జనం ఆదరిస్తున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్ గా వచ్చి హిట్టైన ఆర్.ఎక్స్ 100.
ఆ సినిమా సక్సెస్ తో... తెలుగులో విభిన్నమైన కథలు, టైటిల్సో తో సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు 'పకోడి' అనే టైటిల్ తో ఓ విభిన్నమైన కథా చిత్రం రాబోతోంది. ఇదో లవ్ స్టోరీ. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేసారు. లైఫ్ లో ఊహించని మూవ్ మెంట్స్ కు.. పకోడి మూవ్ మెంట్స్ అని పేరు పెడుతూ.. ఈ సినిమా చేసారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ దర్శకుడు జయంత్ గాలి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.
ఇదో ఓ ఇండిపెండెంట్ సినిమా. ఇది తెలుగు సినిమానే కాని కొత్తదనం ఏమిటీ అంటే తెలుగు, తెంగ్లీష్ లో డైలాగులు ఉండబోతున్నాయి. ఈ సినిమా అర్బన్ యూత్ ని టార్గెట్ చేసారని అర్దం అవుతోంది. ఈ సినిమా మొత్తం బెంగుళూరులో షూట్ చేసారు.
కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా యువతకు నచ్చే సినిమా అవుతుందని యూనిట్ అభిప్రాయపడుతోంది. ఈ సినిమాకు సాగర్ వైవివి, జితిన్ మోహన్ ఛాయాగ్రహణం అందించగా, పవన్ కుమార్ సంగీతం అందించారు. శశిథర్ చావలి ఎడిటింగ్, దండు రంజీవ్ కళా దర్శకత్వం వహించారు. దర్శకుడు జయంత్ గాలి స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది.