#Allu Sirish: ‘ఊర్వశివో రాక్షసివో’ ఓటిటి రిలీజ్ డేట్, ప్లాట్ ఫామ్

By Surya PrakashFirst Published Nov 6, 2022, 6:21 AM IST
Highlights

 అల్లు శిరీష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘విజేత’ ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  ఈ లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.
 


 అల్లు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ 2, శ్రీ తిరుమల ప్రొడక్షన్ బ్యానర్స్ పై బన్నీ వాసు, విజయ్ కుమార్ ఎం, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా తెరకెక్కిన తాజా మూవీ ఊర్వశివో రాక్షసివో.  సునీల్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ఆమని, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీ మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చి   హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో కొనసాగుతోంది.  అల్లు శిరీష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘విజేత’ ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  ఈ లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.

ఇక ఈ మూవీ యొక్క ఒటిటి స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ సంస్థలు ఆహా, నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి.నవంబర్ 4న సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కాబట్టి.. ఓటిటి రిలీజ్ ఓ నెలలో అంటే డిసెంబర్ 4కి రానుంది. ఇక, ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన “ప్యార్ ప్రేమ కాదల్’ మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కింది.  

తమ భావాలు ... ఆశలు .. ఆశయాలు వేరైన ఒక అమ్మాయి .. అబ్బాయి కలిసి జీవితాన్ని కొనసాగించాలనుకుంటే, ఆ ఇద్దరూ కూడా ఒకరి దారిలోకి మరొకరిని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకి దృశ్య రూపమే 'ఊర్వశివో రాక్షసివో' సినిమా.   దర్శకుడు రాకేశ్ శశి ఈ కథను ఆసక్తికరమైన కథనంతో ముందుకు నడిపించాడు. హీరో హీరోయిన్ల స్వభావం విషయంలో ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇవ్వడంలోను, ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసే విషయంలోను , ఏ పాత్రను ఎంతవరకూ తీసుకుని వెళ్లాలనే విషయంలోను ఆయన సక్సెస్ అయ్యాడు. అలాగే రొమాన్స్ .. కామెడీ .. ఎమోషన్ మధ్య ఎక్కడా లింకులు తెగిపోకుండా చూసుకోవడంలోనూ మంచి ప్రతిభను కనబరిచాడు. 

 అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకెళ్తున్న ఊర్వశివో రాక్షసివో మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ లో జరగనుండగా ఈ వేడుకకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.

click me!