
కొన్ని రోజులుగా ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమాలో అతడి పెద్ద కొడుకు అభయ్ రామ్ నటించాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అభయ్ రామ్ షూటింగ్ స్పాట్ లో కనిపిస్తున్న మేకింగ్ వీడియో బయటకి రావడంతో నిజంగానే అతడు నటించి ఉంటాడని అభిమానులు ఆశించారు.
ఇదే విషయంపై ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించగా.. దానికి సమాధానంగా ఆయన అభయ్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ''ఒకరోజు అభయ్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చాడు. మేకింగ్ వీడియో కోసం అభయ్ విజువల్స్ ని కూడా రికార్డ్ చేశారు. దీంతో నేను త్రివిక్రమ్ ని ఆ షాట్స్ తొలగించమని అడిగాను.
దానికి ఆయన ఒప్పుకొని రెండు షాట్లు తీసేశారు. కనీసం ఒక షాట్ అయినా పెడదామని త్రివిక్రమ్ కోరడంతో అభయ్ మేకింగ్ వీడియోలో కనిపించాడు. ఇక మిగిలిన విషయాలన్నీ మీకు తెలిసిందే.
అభయ్ సినిమాలో నటిస్తున్నాడనేది రూమర్ మాత్రమే'' అంటూ వెల్లడించాడు. ఇక అరవింద సమేత సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి..
'అరవింద సమేత'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటంటే..?
కళ్యాణ్ రామ్ తల్లి గురించి ఎన్టీఆర్ ఏమన్నాడంటే..?
'అరవింద సమేత'పై రన్ టైమ్ ఎఫెక్ట్..?
ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!
అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!
అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్
'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?
తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!