ఆ నిర్మాత దారుణంగా హింసించాడు.. నటి ఫోటోలు వైరల్!

Published : Oct 09, 2018, 02:15 PM IST
ఆ నిర్మాత దారుణంగా హింసించాడు.. నటి ఫోటోలు వైరల్!

సారాంశం

తెలుగులో 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆశా షైనీ.. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాలలో మెరిసింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొందరు తారలు తాను ఎదుకొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. 

తెలుగులో 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆశా షైనీ.. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాలలో మెరిసింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొందరు తారలు తాను ఎదుకొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆశాషైనీ కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఓ నిర్మాత తనను ఎంతగా వేధించాడో  వెల్లడించింది. ముఖం అంతా దెబ్బలతో ఉన్న ఫోటోలను అభిమానులకి షేర్ చేస్తూ.. 'అది నేనే 2007 లో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గౌరంగ్ దోషి నన్ను దారుణంగా కొట్టాడు. సంవత్సరం పాటు నాకు నరకం చూపించాడు. దాని ఫలితంగా నా ముఖంపై చెరిగిపోని గాట్లు పడ్డాయి.

ఆ సమయంలో నేను ఈ విషయాలను బయట పెడితే ఎవరూ నమ్మేవారు కాదు. అతనికున్న పలుకుబడి ముందు నేను నిలవలేకపోయాను. నాకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని చాలా సార్లు బెదిరించాడు. నేను మాత్రమే కాదు నాలాంటి వాళ్లు ఎందరినో గౌరంగ్ ఇబ్బందిపెట్టాడు. వారంతా నాకు ఫోన్లు చేసి సహాయం చేయమని అడిగేవారు.

కానీ నేను ఆ ధైర్యం చేయలేకపోయాను. ఇలాంటి దారుణాల గురించి బయటపెడుతున్న వారికి సపోర్ట్ గా ఉండడానికి నేను ఈ పోస్ట్ పెడుతున్నాను. మీ లాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం'' అంటూ వెల్లడించింది.  

ఇవి కూడా చదవండి..

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు
 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్