కోమాలో నర్సింగ్ యాదవ్, వెంటిలేటర్ పై చికిత్స

By Surya PrakashFirst Published Apr 10, 2020, 7:37 AM IST
Highlights

సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి  వెళ్లారు. గురువారం ఉదయం ఎప్పటిలా గానే డయాలసిస్ చేయించుకున్న ఆయన సాయంత్రం 4 గంటల టైమ్ లో  అపస్మారక స్థితిలోకి వెళ్లారు. 

ప్రముఖ సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్దితి ఏమీ బాగోలేదు. ఆయన  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా నర్సింగ్‌ యాదవ్‌ అనార్యోగం తో బాధపడుతున్నారని సమాచారం. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్‌ ఉన్నారు.

 గురువారం సాయంత్రం 4 గంటలకు వున్నట్టుండి కోమాలోకి వెళ్లారు నర్సింగ్ యాదవ్. నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర మాట్లాడుతూ.. తన భర్త గురువారం  సాయంత్రం 4 గంటలు కు అపస్మారక స్థితిలోకి వెళ్ళేరని తెలిపారు. దాంతో ఆయనను  సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించమని,48 గంటలు పాటు అబ్జర్వేషన్  లో ఉంచారుని, ఇంకా వెంటిలేటర్ పై నే చికిత్స కొనసాగుతుంది తెలిపారు. ఆయన కొంతకాలంగా కిడ్నీసమస్యతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం ఎప్పటిలా గానే డయాలసిస్ చేయించుకున్న ఆయన సాయంత్రం  అపస్మారక స్థి తికి వెళ్లారు.

ఇక ఇంట్లో కింద పడిపోయాడు, తల కి గాయం అయ్యింది అని వస్తున్న వార్త లు అవాస్తవం ,తను ఎక్కడ పడిపోలేదు , ఉన్నట్లు ఉండి కోమా లోకి వెళ్ళిపోయాడని తెలిపారు. కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం,సోషల్  మీడియా లో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి, ఆయన క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి అని ఆమె కోరారు. రీసెంట్ గా చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'లోనూ నటించారు నర్సింగ్ యాదవ్.  

click me!