కరోనా పై పోరాటం:భారీ విరాళం ప్రకటించిన బాలయ్య

By Surya PrakashFirst Published Apr 3, 2020, 2:22 PM IST
Highlights

జనం నోటి కొచ్చినట్లు కామెంట్ చేసినా ఆయన అవేమీ పట్టించుకోకుండా తన స్దాయికి తగ్గట్లుగా విరాళాల ప్రకటన చేసారు. కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. 


గత నాలుగు రోజులుగా బాలయ్య ..భాధ్యత లేకుండా కరోనాని ఎదుర్కోవటానికి విరాళాలు ప్రకటించలేదంటూ మీడియాలో,సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బాలయ్య ఇలా చేస్తున్నాడేంటి అంటూ కొన్ని వెబ్ సైట్స్ మరీ దారుణంగా రాసుకొచ్చాయి. అయితే ప్రతీదానికి ఓ టైమ్, లిమిట్ ఉంటుంది. జనం నోటి కొచ్చినట్లు కామెంట్ చేసినా ఆయన అవేమీ పట్టించుకోకుండా తన స్దాయికి తగ్గట్లుగా విరాళాల ప్రకటన చేసారు. కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేసారు.

balakrishna

వివరాల్లోకి వెళితే.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందించారు. 

అలాగే స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనా ని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభమైంది. అయితే కరోనా ప్రభావంతో షూటింగ్ ఆపుచేసారు.

click me!