అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు

By Satish ReddyFirst Published Sep 23, 2020, 4:38 PM IST
Highlights

బాలీవుడ్ నటి దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణల చేయడం జరిగింది. కాగా నేడు ఆమె తన లాయర్ సహాయంతో పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యింది. రేప్ తో పాటు పలు సెక్షన్స్ క్రింద అనురాగ్ పై కేసు నమోదు అయ్యింది.  
 

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు నమోదు అయ్యింది. నటి పిర్యాదు మేరకు అనురాగ్ పై పోలీసులు రేప్ చేశారంటూ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది. మానభంగం, వేధింపులు, దుష్ప్రవర్తన, నిర్బంధించడం వంటి పలు సెక్షన్స్ క్రింద అనురాగ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో అనురాగ్ పాల్గొనాల్సి వుంది. రేప్ ఆరోపణనలు అనురాగ్ కశ్యప్ ఖండించడం జరిగింది. అలాగే అనురాగ్ మాజీ భార్యలు కల్కి, ఆర్తి మరియు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంలో అనురాగ్ కి మద్దతు తెలిపారు. 

బాలీవుడ్ నటి  2013లో అనురాగ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసుపెట్టారు.ముంబై యారి రోడ్ లోని వర్సోవా ప్రాంతంలో తనపై అనురాగ్ కశ్యప్ లైంగిక దాడికి పాల్పడడంతో పాటు, అసభ్యంగా ప్రవర్తించారని ఆ హీరోయిన్  కేసుపెట్టారట. ఆమె లాయర్  మిస్టర్ సాత్ పుతే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.  

కేవలం  ఆరోపణలతో ముగుస్తుందనుకున్న ఈ వివాదం మరింత పెద్దది అయ్యేలా కనిపిస్తుంది. అనురాగ్ పై రేప్ కేసు కూడా ఫైల్ కాగా ఈ వివాదం ఎక్కడికి వెళుతుందో అర్థం కావడం లేదు. ఒక విధంగా అనురాగ్ ఈ కేసులో పూర్తిగా ఇరుకున్నారు అనిపిస్తుంది. తగు సాక్ష్యాధారాలతో ఆయన నిర్దోషి అని బయటపడని నేపథ్యంలో అరెస్ట్ కూడా జరిగే అవకాశం కలదు. మొత్తంగా బాలీవుడ్ లో అనురాగ్ లైంగిక ఆరోపణల కేసు ఎఫ్ ఐ ఆర్ నమోదుతో కీలక మలుపు తిరిగినట్లు అయ్యింది. 
 

click me!