మెగా ఫ్యాన్స్ కి పండగే.. చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ నుంచి టీజర్ రిలీజ్

By Mahesh JujjuriFirst Published Aug 22, 2022, 6:38 AM IST
Highlights

మెగా ఫ్యాన్స్ కు ఇక పండగే పండగా. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈరోజు నుంచి ఆయన సినిమాల అప్ డేట్స్ తో .. ఇండస్ట్రీ అంతా హడావిడిస్టార్ట్ కాబోతోంది. ఇక ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. 

మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న  టైమ్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు అంటే అది అభిమానులకు పండగే. అదే రోజు మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ తో పాటు ఆయన సినిమాల అప్ డేస్ట్ కూడా వరుసగా వస్తుంటాయి. దాంతో ఫ్యాన్స్ సంబరాలకు అంతే ఉండదు. అనుకన్నట్టుగానే ఈసారి కూడా  మెగా మేళ జరగబోతుంది. దానికి ఆరంభంగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. 

 మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీ గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ అయ్యింది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్  మురళీ శర్మ వాయిత్ తో టీజర్ మొదలయింది.  20 ఏళ్లు ఎక్కడకు వెళ్లాడో ఎవరికీ తెలియదు. సడన్ గా తిరిగి వచ్చిన ఆరేళ్లలో చాలా మంచి పాప్యులారిటీని సంపాదించుకున్నాడు.. అంటూ టీజర్  స్టార్ట్ అవుతుంది. టీజర్ ఆద్యంతా మెగా అభిమానుల తో పాటు ఆడియన్స్ ను అలరించే విధంగా ఉంది. సినిమాపై హోప్ ను పెంచేస్తోంది. ఇక  మోహన్ రాజా డైరెక్టర్ చేసిన గాడ్ ఫాదర్ టీజర్ లో .. చిరుతో పాటు నయనతార, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ కూడా కనిపించారు. 

 

గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ పొలిటికల్ లీడర్ పాత్రను పోషించారు.  రాజకీయ నాయకుడిగా ఆయన లుక్ ఆకర్షనీయంగా ఉంది. మలయాళంలో మోహన్ లాల్ నటించి.. ఘన విజయం సాధించిన లూసిఫర్ సినిమాకు గాడ్ ఫాదర్ ను  రీమేక్  సినిమాగా  నిర్మించారు. ఇక టీజర్ చివర్లో  సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సల్మాన్ ఖాన్ ను ఉద్దేశిస్తూ వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా అక్టోబర్ లో  ఈ సినిమాను రిలీజ్  చేయాలని మూవీ టీమ్ చూస్తున్నారు. . ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. 

click me!