ఎన్టీఆర్ 'కథానాయకుడు' లెంగ్త్ ఎంతంటే..?

By Udayavani DhuliFirst Published Oct 20, 2018, 4:26 PM IST
Highlights

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకేక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఒకటి ఎన్టీఆర్ 'కథానాయకుడు' కాగా మరొకటి ఎన్టీఆర్ 'మహానాయకుడు'

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకేక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఒకటి ఎన్టీఆర్ 'కథానాయకుడు' కాగా మరొకటి ఎన్టీఆర్ 'మహానాయకుడు'.

అయితే ఇప్పటికే తొలి పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తి చేశారని సమాచారం. తొలిభాగం లెంగ్త్ రెండు గంటల 26 నిమిషాలకు కట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇది సరైన నిడివి అనే చెప్పాలి. ఎన్టీఆర్ బాల్యం దగ్గర సినిమాను మొదలుపెట్టి రాజకీయ ప్రవేశం దగ్గర సినిమాను ఎండ్ చేస్తారని తెలుస్తోంది. సినిమాలు, రాజకీయాలను దేనికదే సెపరేట్ గా ఉండాలని పార్టీ ప్రకటనతో ఫస్ట్ పార్ట్ ని ముగించనున్నారు.

పార్టీ ప్రకటన సమయంలో ఎన్టీఆర్ ఇచ్చే సినిమాకి హైలైట్ గా నిలిచి రెండో భాగంపై ఆసక్తిని క్రియేట్ చేసే విధంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ స్పీచ్ మొత్తాన్ని సాయి మాధవ్ బుర్రాతో ప్రత్యేకంగా రాయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్త.. 

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ

 

 

 

click me!