తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:37 PM (IST) May 29
తమిళ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన ఒక వ్యాఖ్య ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, "కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది" అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
07:55 PM (IST) May 29
గద్దర్ అవార్డు ల ప్రకటనతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ కొత్త శకం మొదలయ్యింది. ఈక్రమంలో ఈ అవార్డ్స్ సాధించిన వారు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఈ అవార్డు లపై సోషల్ మీడియాలో స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
06:40 PM (IST) May 29
సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన ఓ హీరోయిన్ సడెన్ గా సినిమాలు మానేసింది. పెళ్లి కూడా చేసుకోకుండానే ఓ బిడ్డకు తల్లి అయిన ఆ బ్యూటీ.. తాజాగా మరోసారి తల్లి కాబోతున్నట్టు చెప్పకనే చెప్పింది.
04:33 PM (IST) May 29
శోభన్ బాబు ఓ కార్యక్రమంలో చిరంజీవి తన బిడ్డతో సమానం అని అన్నారు. అలా ఎందుకన్నారో ఈ కథనంలో చూద్దాం.
03:26 PM (IST) May 29
కన్నడ భాష గురించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ మాత్రం కమల్‌కి మద్దతుగా నిలిచారు.
02:50 PM (IST) May 29
థగ్ లైఫ్ సినిమాలో నటుడు కమల్ హాసన్‌తో ముద్దు సీన్‌లో నటించడం వివాదాస్పదమైన నేపథ్యంలో, నటి అభిరామి వివరణ ఇచ్చారు.
02:02 PM (IST) May 29
నటుడు రాజేష్ మరణంతో తమిళ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణానికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
01:33 PM (IST) May 29
రష్మిక మందన్న పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు విజయ్ దేవరకొండ ఇంట్లో తీసినవిగా అభిమానులు భావిస్తున్నారు. రష్మిక కూర్చుని ఉన్న స్థలం విజయ్ దేవరకొండ ఇల్లు అనేలా అందులో హింట్ ఉంది.
12:30 PM (IST) May 29
గద్దర్ అవార్డ్స్ లో కల్కి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి ఒక చిన్న చిత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఆ చిత్రం మరేదో కాదు నివేదా థామస్ నటించిన '35 చిన్న కథ కాదు'.
11:31 AM (IST) May 29
14 ఏళ్ళ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ అవార్డుల సంబరం మొదలైంది. కొద్దిసేపటి క్రితమే జయసుధ.. దిల్ రాజు, జీవిత రాజశేఖర్ లాంటి ప్రముఖులతో కలసి గద్దర్ అవార్డులని ప్రకటించారు.
09:53 AM (IST) May 29
ఖలేజా బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడానికి మహేష్ బాబు అభిమానులే కారణం అంటూ నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఖలేజా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.
09:40 AM (IST) May 29
`ఓజీ` టీమ్‌కి మరో షాక్. నటుడు ఇమ్రాన్ హాష్మీకి డెంగ్యూ జ్వరం వచ్చింది., దీనివల్ల 'ఓజీ' సినిమా షూటింగ్ ఆగిపోయింది.
08:22 AM (IST) May 29
టాలీవుడ్ యంగ్ హీరో ఒకరితో మణిరత్నం ప్రేమ కథా చిత్రం రూపొందించబోతున్నారు అనే వార్త వైరల్ గా మారింది. దీనిలో వాస్తవం ఎంత ఉందో తెలుసుకుందాం.
07:31 AM (IST) May 29
యాంకర్ రవి అడిగిన ప్రశ్నకి రాజమౌళి సమాధానం ఇస్తూ ఒక దర్శకుడిని మరో దర్శకుడితో పోల్చడం సరికాదని అన్నారు. ఎందుకంటే నేను తీసే సినిమాలు పూరి జగన్నాథ్ గారు తీయలేరు.. పూరి తీసే సినిమాలు వివి వినాయక్ గారు తీయలేరు.