Apr 13, 2025, 11:17 PM IST
Telugu Cinema News Live : తిరుమలలో గుండు చేయించుకున్న పవన్ కళ్యాణ్ భార్య, కొడుకు కోసం మొక్కు తీర్చుకున్న అన్నా లెజినోవా


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:17 PM
తిరుమలలో గుండు చేయించుకున్న పవన్ కళ్యాణ్ భార్య, కొడుకు కోసం మొక్కు తీర్చుకున్న అన్నా లెజినోవా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా తిరుమల తిరుపతి లో శ్రీవారిదర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆమె గుండుచేయించుకుని, శ్రీవారికి తలనీలాల మొక్కులు కూడా చెల్లించుకున్నారు. సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి తన తనయుడు మార్క్ శంకర్ బయటపడటంతో ఆమె తన మొక్కులు చెల్లించుకున్నారు.
పూర్తి కథనం చదవండి9:50 PM
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రామ లక్ష్మణుల్లా ఉంటారు, మాజీ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR and Kalyan Ram: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇద్దరు రామలక్ష్మణుల మాదిరి ఉంటారని, వారిన ఎప్పుడు ఇలానే గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అన్నారు ఓ స్టార్ హీరోయిన్. అన్నా తమ్ముడు ఇద్దరు ఎంతో కష్టపడతారు, ఏ పని అయినా కమిట్మెంట్ తో చేస్తారు. అందరికి ఆదర్శంగా నిలిచారు అని ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ను పొగడ్తలతో ముంచెత్తిన నటి ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి7:46 PM
ఒకే గాయకుడితో పాటలు.. ఫ్లాప్ మూవీని హిట్టు చేసిన ఇళయరాజా.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Ilaiyaraaja ఇళయరాజా సంగీతం అందించిన ఒక సినిమా కోసం ఒకే ఒక్క మగ గాయకుడు పాడి, ఆ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఎక్కడ చూసిన అవే పాటలు మారుమోగాయి. మరి ఈ విషయంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా చేసిన మ్యాజిక్ ఏంటి.? అంతగా ఆదరణ పొందిన ఆ మూవీ ఏంటి? ఈ కథేంటో ఇందులో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి7:41 PM
1500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత. పాన్ ఇండియా హీరోల జంటగా స్టార్ హీరోయిన్
సమంత మళ్లీ ఫామ్ లోకి రాబోతోంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత మోరవబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ళుగా టాలీవుడ్ వైపు చూడలేదు సమంత. ఖుషి సినిమా తరువాత ఆమె కనిపించలేదు. రీ ఎంట్రీ గట్టిగా ఉంటుంది అన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. ఏడాది పాటు రెస్ట్ తీసుకున్న ఈ హీరోయన్ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేసింది. ఇక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. సమంత.
పూర్తి కథనం చదవండి7:21 PM
స్టార్ హీరో కొడుకుతో అనుపమా పరమేశ్వరన్ సీక్రెట్‌గా లవ్ ట్రాక్.. త్వరలో పెళ్లి?
Anupama Parameswaran Dating: అనుపమా పరమేశ్వరన్ `ప్రేమమ్` మూవీతో తెలుగు ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుసగా ట్రెడిషనల్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది. హీరోయిన్‌గానే కాదు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల కాలంలో గ్లామర్ కి గేట్లు ఎత్తేసింది. `టిల్లు స్వ్కేర్`లో ఆమెని చూసి అంతా షాక్ అయ్యారు. ఇదేంటని ప్రశ్నిస్తే, అది నా ఇష్టం అంటోంది. లిప్ లాక్‌లు, ఎక్స్ పోజింగ్‌తోనూ దుమారం రేపిన అనుపమా ఇప్పుడు స్టార్ హీరో కొడుకుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందట.
పూర్తి కథనం చదవండి6:36 PM
కొడుకు మార్క్ శంకర్ ప్రాణాల కోసం మతం పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ భార్య, తిరుమల శ్రీవారికి మొక్కు
Pawan Kalyan son Mark Shankar: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్, భార్య అన్నా లెజినోవాతో హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ రోజు సాయంత్రం తిరుమల చేరుకున్నారు. అక్కడ ఈ రోజు రాత్రి బస చేసి రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సింగపూర్‌లో ఇటీవల కొడుకు అగ్నిప్రమాదానికి గురై విషయం తెలిసిందే. పెద్ద ప్రమాదం నుంచి కొడుకు ప్రాణాలతో బయటపడిన నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకోబోతున్నారు పవన్ కుటుంబం.
6:03 PM
దయచేసి ఫ్యామిలీతో చూడకండి, ఈ పాయింట్ తో మూవీ ఎలా తీశాడు బాబోయ్.. కంప్లీట్ అడల్ట్ కామెడీ
Ibomma: ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చూసుంటారు. కానీ ఇది అడల్ట్ కామెడీలో జోనర్ లో సర్ప్రైజ్ చేసే చిత్రం. సినిమా చూశాక ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది అనే ఆశ్చర్యం కలగక మానదు.
పూర్తి కథనం చదవండి5:27 PM
పవన్ కొడుకుతో సహా 22 మందిని కాపాడిన నలుగురు కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం సన్మానం
సింగపూర్‌లోని ఓ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు మార్కో శంకర్‌తో కలిపి 22 మందిని కాపాడిన భారతీయ కార్మికులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సన్మానించింది. ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి4:54 PM
విజయ్ నకిలీ రాజకీయ నాయకుడు, కట్టప్ప కూతురు సంచలన వ్యాఖ్యలు
ఉదయనిధి నకిలీ రాజకీయ నాయకుడు కాదు... వర్షం వచ్చినా, వరద వచ్చినా పని చేస్తారని దివ్య సత్యరాజ్ డీఎంకే వేదికపై మాట్లాడారు.
పూర్తి కథనం చదవండి4:30 PM
రజినీకాంత్ చేతుల్లో దెబ్బలు తిన్న నాగార్జున, ట్విస్ట్ ఏంటంటే?
Rajinikanth vs Nagarjuna: కింగ్ నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరో. 90స్ ల్ తెలుగు సినీ పరిశ్రమను ఏలిన స్టార్ హీరోల్లో నాగార్జున ఒకరు. ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్స్ మాదిరిగా చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఉండేవారు. ఇక ఇప్పటికీ వారి క్రేజ్ ఏమాత్రం తగ్గిపోలేదు. మెగాస్టార్, బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూనే ఉన్నారు వెంకటేష్ కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్ సనిమాలతో హిట్ మీద హిట్ కొడుతున్నాడు. కాని నాగార్జునకే టైమ్ పెద్దగా కలిసిరావడంలేదు. వరుసగా ప్లాప్ సినిమాలతో సవాసం చేస్తున్నాడు నాగార్జున. దాంతో మల్టీ స్టారర్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోయిజం ఉన్న క్యారెక్టర్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు నాక్. అంతే కాదు తాజాగా విలన్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగార్జున.
పూర్తి కథనం చదవండి2:27 PM
మంచు మనోజ్‌ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న అక్క మంచు లక్ష్మి.. కదిలిస్తున్న వీడియో.. వైరల్
మంచు ఫ్యామిలీలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు నెలలుగా మంచు మోహన్‌బాబు, మంచు విష్ణులకు, మంచు మనోజ్‌కి మధ్య గొడవలు అవుతున్నాయి. ఆస్తుల విషయంలోనే ఈ గొడవలు అని బయటకు తెలుస్తుంది. కానీ కాలేజీ, యూనివర్సిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. కానీ మనోజ్ ఇలా చేయడం సరికాదని, తాగి ఇంటికి వచ్చి గొడవలు పెట్టుకుంటున్నాడని మోహన్ బాబు అంటున్నాడు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు.
1:55 PM
అనసూయ, రష్మిలా బిహేవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు.. గ్లామర్ చూపించకుండానే ఛాన్సులు వస్తాయి
అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ అవకాశం కన్నడ బ్యూటీ సౌమ్య రావుకి దక్కింది. కొంతకాలం సౌమ్య రావు జబర్దస్త్ షోలో మెరిసింది.
పూర్తి కథనం చదవండి1:33 PM
సీఎం సీఎం నినాదాలు, ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. తారక్‌ని బ్రతిమాలుకున్న విజయశాంతి
Ntr-Vijayashanti: స్టార్ హీరోల సినిమాల ఈవెంట్లలో ఫ్యాన్స్ చేసే హడావుడి వేరే లెవల్‌లో ఉంటుంది. మిగిలిన వారి ప్రసంగాలను అడ్డుకునే స్థాయిలో ఉంటుంది. దీని కారణంగా మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కళ్యాణ్ హీరోగా నటించిన `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయశాంతిని మాట్లాడనివ్వకుండా చేశారు తారక్ ఫ్యాన్స్. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె అసహనానికి గురయ్యింది. దీనికి తారక్ రియాక్షన్ ఏంటంటే?
12:42 PM
SSMB 29 కి సాయం చేస్తున్న ఫ్లాప్ డైరెక్టర్, రాజమౌళికి అంత నమ్మకం ఏంటి ?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB 29(వర్కింగ్ టైటిల్). 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి12:25 PM
Vishwambhara Story Leak: ఏడు లోకాలు, ఏడు గెటప్‌లు, సెకండాఫ్ మొత్తం అదే.. `విశ్వంభర` స్టోరీ లీక్
Vishwambhara Story: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ముగింపు దశలో ఉంది. అయితే ఎప్పుడు రిలీజ్ అనే సస్పెన్స్ నెలకొంది. జూన్‌లో రాబోతుందనే టాక్ వినిపిస్తుంది. కానీ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అదే సమయంలో మూవీ కథ గురించి వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. స్టోరీ లీక్ అయ్యిందని, కథ ఇదే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ట తండ్రి అసలు కథ బయటపెట్టాడు. మరి ఆ కథేంటో చూద్దాం.
11:23 AM
Good Bad Ugly 3 Days Collections: `డ్రాగన్`ను అధిగమించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ`.. బాక్సాఫీస్ వద్ద రికార్డు!
Good Bad Ugly 3 Days Collections: ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మూడవ రోజు వసూళ్ల వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి11:03 AM
థియేటర్లను మోతెక్కిస్తున్న ప్రియా వారియర్, సిమ్రాన్ లా మారిపోయి మరో సంచలనం
కన్ను గీటి ఫేమస్ అయిన నటి ప్రియా వారియర్ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మళ్లీ సంచలనం సృష్టించింది.
పూర్తి కథనం చదవండి10:34 AM
Jaat Collections: `జాట్` డే 3 కలెక్షన్లు, సన్నీ డియోల్ మూవీకి సీన్ రివర్స్
Jaat 3 Days Collections: సన్నీ డియోల్ హీరోగా నటించిన'జాట్' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కాస్త తగ్గినా, మూడో రోజు మాత్రం బాగా కలెక్ట్ చేసింది. మాస్ ఆడియెన్స్ కి ఎక్కడంతో నెమ్మదిగా వసూళ్లు పుంజుకుంటున్నారు. మూడో రోజు భారీగా వసూళ్లు పెరిగాయి. మరి మూడు రోజుల్లో ఈ మూవీ ఎంత వసూలు చేసిందంటే?
పూర్తి కథనం చదవండి10:26 AM
టాలీవుడ్ లో రాజశేఖర్ నంబర్ 1 హీరో అయ్యే ఛాన్స్, చిరంజీవిని మించే అవకాశాన్ని ఎలా చేజార్చుకున్నాడు ?
టాలీవుడ్ లో పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరోల్లో రాజశేఖర్ ఒకరు. సీరియస్ పాత్రల్లో నటించాలి అంటే రాజశేఖర్ ది బెస్ట్ అన్నట్లుగా గుర్తింపు పొందారు. టాలీవుడ్ నంబర్ 1 హీరోగా ఎదిగే అవకాశం రాజశేఖర్ కి ఒక దశలో వచ్చింది.
పూర్తి కథనం చదవండి9:06 AM
అల్లు అర్జున్ కటౌట్‌పై అల్లు అరవింద్ సెటైర్లు, సొంత కొడుకునే అంత మాట అన్నాడా? `ఆర్య` వెనుక క్రేజీ స్టోరీ
అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా రాణిస్తున్నారు. `పుష్ప 2` సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్‌లో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇండియా బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా నిలిచారు. నెక్ట్స్ బన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్‌ని టార్గెట్ చేశారు. అట్లీతో చేయబోయే మూవీని సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నారు. దీన్ని సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మూవీతో బన్నీ తాను ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదగాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
7:32 AM
సుమనే మెగాస్టార్, చిరంజీవితో పోటీపై స్టార్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్
చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన గత మూడుదశాబ్దాలుగా తిరుగులేని మెగాస్టార్‌గా ఆదరణ పొందుతున్నారు. అయితే అసలు మెగాస్టార్ కావాల్సింది చిరంజీవి కాదా? స్వయంగా చిరునే ఈ విషయం చెప్పారా? అసలు నేను కాదు సుమనే అసలు మెగాస్టార్ అని చిరంజీవి అన్నారా? అనే విషయాలపై సుమన్ స్పందించారు. ఆయన ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.