Apr 8, 2025, 10:16 PM IST
Telugu Cinema News Live : అకీరానందన్ పుట్టిన రోజే మార్క్ శంకర్‌కి ప్రమాదం.. కొడుకు పరిస్థితిని తలుచుకొని పవన్ కళ్యాణ్ ఎమోషనల్


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:16 PM
అకీరానందన్ పుట్టిన రోజే మార్క్ శంకర్‌కి ప్రమాదం.. కొడుకు పరిస్థితిని తలుచుకొని పవన్ కళ్యాణ్ ఎమోషనల్
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్లో విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఓ వైపు పెద్ద కొడుకు విషయంలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. మరోవైపు చిన్న కొడుకు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం. ఇది తలచుకుని డిప్యూటీ సీఎం ఎమోనల్ అయ్యారు. తనకు ఎదురైన ఈ విచిత్రమైన పరిస్థితి పట్ల పవన్ విచారం వ్యక్తం చేశారు. తాజాగా కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పవన్ కళ్యాణ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తన ఫ్యామిలీలో నెలకొన్న పరిస్థితిని తలుచుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు.
పూర్తి కథనం చదవండి8:36 PM
కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యంపై స్పందించిన పవన్.. ఇప్పుడు ఎలా ఉందంటే? అన్న చిరుతో కలిసి సింగపూర్ ప్రయాణం
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మార్క్ శంకర్‌తోపాటు మరికొంత మంది చిన్నారులు గాయాలపాలయ్యారు. వారిని రిస్క్యూ టీమ్ కాపాడి ఆసుపత్రికి తరలించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ టీమ్ మీడియాకి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అప్ డేట్ ఇచ్చారు పవన్‌కళ్యాణ్. తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉందో వెల్లడించారు.
8:01 PM
అల్లు అర్జున్, అట్లీ మూవీలో హీరోయిన్ ఫిక్స్?, 10 ఏళ్ల తర్వాత రొమాన్స్.. కొడితే కుంభస్థలమే!
Allu Arjun-Atlee Film: `పుష్ప 2` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేయబోతున్నారనే సస్పెన్స్ నెలకొంది. రకరకాలు రూమర్స్ వినిపించాయి. త్రివిక్రమ్‌తో సినిమా ఉండబోతుందన్నారు. అలాగే అట్లీ డైరెక్షన్‌లో సినిమా ఉంటుందన్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రారంభమవుతాయని వార్తలు వచ్చాయి. ఇలా రకరకాలుగా రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకుబన్నీ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. అట్లీ దర్శకత్వంలోనే ఈ మూవీ ఉంటుందని ప్రకటించారు. ఇది ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఉండబోతుందని, సూపర్ హీరోల ఫిల్మ్ ని తలపించేలా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో దీన్ని తెరకెక్కించబోతున్నారనే విషయాన్ని వీడియోతో చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇందులో నటించే హీరోయిన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి7:29 PM
`బిగ్ బాస్ తెలుగు 9` హోస్ట్ గా బాలకృష్ణ?.. నాగార్జునకి పొగబెట్టబోతున్నారా? అసలేం జరుగుతుందంటే?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకి మన వద్ద సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక సెపరేట్ క్రేజ్ కూడా ఉంది. ఈ షో ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక రెండు మూడు సీజన్లు తప్పితే మిగిలిన సీజన్లలో షో రక్తికట్టేలా లేదని, పెద్దగా సక్సెస్ కాలేదని అంటుంటారు. ఈ షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. గత ఆరు సీజన్లకి ఆయనే హోస్ట్. అయితే ఇప్పుడు ఆయన్ని తప్పిస్తున్నారని, బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి బాలకృష్ణని హోస్ట్ గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఇంతకి బిగ్ బాస్ షో విషయంలో ఏం జరుగుతుందనేది చూస్తే.
పూర్తి కథనం చదవండి6:00 PM
Lenin Glimpse: పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది.. అఖిల్‌కి ఇన్నాళ్లకి సరైన సినిమా పడిందా?
Akhil Akkineni: అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. నాగార్జున రెండో కుమారుడు అఖిల్.. `అఖిల్` చిత్రంతోనే హీరోగా పరిచయం అయ్యారు. ఇది యావరేజ్‌గా ఆడింది. ఆ తర్వాత `హలో` మూవీ సైతం నిరాశ పరిచింది. అలాగే `మిస్టర్ మజ్ను`తో ఆడలేదు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` మూవీ యావరేజ్‌గా ఆడింది. రెండేళ్ల క్రితం వచ్చిన `ఏజెంట్` మూవీ కూడా డిజప్పాయింట్ చేస్తుంది. దీంతో అఖిల్ కి ఇప్పటి వరకు సరైన బ్రేక్ ఇచ్చే మూవీ పడలేదు. ఈ క్రమంలో తాజాగా ఆయన `లెనిన్` అనే మూవీతో రాబోతుంది. తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు మంగళవారం ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూద్దాం.
4:45 PM
Friday Releases: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో తెలుసా? మూవీ లవర్స్ కి పండగే పండగ
Friday Releases: సమ్మర్‌లో చాలా వరకు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం సమ్మర్‌లో పెద్ద సినిమాలు రావడం లేదు. మీడియం రేంజ్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్నాయి. సమ్మర్‌లో ఆడియెన్స్ థియేటర్‌లోకి రావడం తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ కూడా చిన్న సినిమాలను, మీడియం రేంజ్ మూవీస్‌నే విడుదల చేస్తున్నారు. కొన్ని పెద్ద మూవీస్ ప్లాన్ చేసినా అవి రకరకాల కారణాలతో వాయిదాలు పడుతున్నాయి. ఇక ఈ వారం(ఏప్రిల్ 10, 11) విడుదలయ్యే సినిమాలేంటి? థియేటర్లో ఎన్ని వస్తున్నాయి? ఓటీటీలో ఎన్ని రిలీజ్ అవుతున్నాయనేది చూస్తే.
3:42 PM
రోజా ఫుల్ టైమ్ రీ ఎంట్రీ, బుల్లితెరపై జబర్థస్త్ ను మించిన షోతో మాజీ హీరోయిన్ సందడి
Roja Full Time TV Comeback : మాజీ మినిస్టర్ రోజా మళ్ళీ బుల్లితెరపై ఫుల్ టైమ్ రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత పెద్దగా కనిపించడంలేదు రోజా. ఇండస్ట్రీలోకి వెళ్ళాలని గత ఏడాదిగా ఆమె ప్రయత్నం చేసినట్టు తెలిసింది. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చిన ఆమెకు, మరోసారి జడ్జిగా గోల్డెన్ ఆఫర్ వచ్చింది. రోజా జడ్జిగా స్టార్ట్ కాబోతున్న కొత్త ప్రోగ్రాం ఏంటి..? రోజా జబర్థస్త్ కు ఎందుకు వెళ్ళలేదు?
పూర్తి కథనం చదవండి3:22 PM
కమల్ హాసన్ లేడీ వాయిస్‌తో పాడిన పాటలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అందులో హిట్ సాంగ్స్ ఇవే?
సినిమా కోసం ఎలాంటి ప్రయోగాలు చేయడానికైన వెనకాడడు లోక నాయకుడు కమల్ హాసన్. ఒక సినిమాలో పది పాత్రలు చేయడం లాంటివి కమల్ హాసన్ కే సాధ్యం. అంతే కాదు ఆయన సినిమాల విషయంలో చేసిన ప్రయోగాల్లో లేడీ వాయిస్ తో పాటులు పాడటం కూడా ఒకటి. ఆయన పాడిన ఫీమేల్ వాయిస్ సాంగ్స్ ఏంటో తెలుసా? అందులో హిట్ అయినవి ఎన్ని?
పూర్తి కథనం చదవండి3:14 PM
మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ ఏ భార్య కొడుకో తెలుసా? సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ కొడుకు మార్క్ శంకర్ చదివే స్కూల్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకుందని, అతను గాయపడ్డాడని తెలిసింది. ఈ విషయం తెలిసి పవన్ హుటాహుటిన సింగపూర్ వెళ్తారని భావించారు. కానీ తాను అల్లూరి సీతారామరాజు జిల్లాలఓ పర్యటించాల్సి ఉంది, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. దీంతో ఆయా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాకనే తాను కొడుకు వద్దకు వెళ్తానని చెప్పారు. జనాలకు మాట ఇచ్చినట్టుగానే ఆ మాటమీద నిలబడటం కోసం ఆయా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తున్నారు. అయితే గాయపడ్డ మార్క్ శంకర్ పవన్ ఏ భార్య కొడుకు? సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరం. మరి ఆ కథేంటో చూద్దాం.
2:26 PM
భర్త కోసం లవర్ ను సెట్ చేసిన భార్య, ఓటీటీలో రచ్చరచ్చ చేస్తున్న వెబ్ మూవీ, ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లో డిఫరెంట్ కంటెంట్ రాను రాను పెరిగిపోతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా పెరగడంతో.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అందిస్తున్నారు మేకర్స్. ఈక్రమంలో డిఫరెంట్ ఐడియాస్స్ ను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై పెడుతున్నారు దర్శకులు. తాజాగా ఓ సినిమా ఓటీటీలో రచ్చ చేస్తుంది. భర్తకు ప్రియురాని సెట్ చేసే భార్య కథ ఇది, పిచ్చెక్కించే కాన్సెప్ట్ తో రచ్చ రచ్చ చేస్తోంది మూవీ. ఇంతకీ ఆసినిమా పేరేంటి ఏంటి? ఏ ప్లాట్ ఫామ్ లో చూడోచ్చంటే?
పూర్తి కథనం చదవండి1:57 PM
ఛావా OTT ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, రష్మిక , విక్కీ కౌశల్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?
Chhaava OTT Release Date: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సమాచారం వచ్చింది.
పూర్తి కథనం చదవండి12:17 PM
సినిమాకు 300 కోట్లు, 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్, మెగాస్టార్ కు కూడా దక్కని గౌరవం సాధించిన బన్నీ
Allu Arjun Birthday : 43 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు టాలీవుడ్ ఐకాస్ స్టార్ అల్లు అర్జున్. టాలీవుడ్ లో రెండు రేర్ రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు బన్నీ. ఒక రకంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి సాధ్యం కాని అవార్డ్ ను తన సొంతం చేసుకున్నాడు. ఇంతకీ బన్నీ సాధించిన ఘనత ఏంటి?
పూర్తి కథనం చదవండి11:22 AM
సమంత రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు ఏంటో తెలుసా? బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ అయిన స్టార్ హీరోయిన్?
సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీలో తన టాలెంట్ తో ఏస్థాయికి ఎదిగిందో అందరికి తెలిసిందే. సౌత్ సినిమాలో ఆల్ మోస్ట్ అందరు స్టార్ హీరోల సరసన నటించిన సమంత.. ఆక్రమంలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను కూడా మిస్ అయ్యిందట. రకరకాల కారణాల వల్ల సమంత హిట్ సినిమాలెన్నో వదలులుకోవలసి వచ్చింది. అందులో స్టార్ హీరోల సినిమాలెన్ని.. ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయంటే?
పూర్తి కథనం చదవండి9:54 AM
అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ తనయుడు, మార్క్ శంకర్ కు గాయాలు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. స్కూల్ లో జరిగిన ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పవన్ తనయుడి పరిస్థితి ఎలా ఉందంటే?
9:19 AM
సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?
Allu Arjun Multi Million Dollar Businesses and Net Worth: పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. పుష్ప2 తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. మెగా,అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఐకాన్ స్టార్.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. సినిమాల కోసం ప్రాణం పెట్టి పనిచేసే అల్లు అర్జున్.. తన కష్టంతో ప్రస్తుతం టాప్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. ఇక సినిమాలతో పాటు పలు వ్యాపారాలు కూడా చేస్తున్న బన్నీ.. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసా? ఆయన సంపాదన ఎంత ఉంటుంది? ఏం బిజినెస్ లు చేస్తున్నారు? అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పూర్తి కథనం చదవండి8:56 AM
పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయన్ ? కారణం ఏంటి?
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు హీరోయిన్లు. అవకాశం రావడం ఆలస్యం వెంటనే కళ్లు మూసుకుని ఒప్పేసుకుంటారు. కాని ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పవర్ స్టార్ తో సినిమా చేయడానికి నో చెప్పేసిందట. అద్భుతమైన అవకాశం రావడమే కష్టం, కాని ఆ అవకాశాన్ని మాత్రం చేతులారా వదిలేసుకుంది స్టార్ బ్యూటీ. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎందుకు పవన్ కళ్యాన్ తో సినిమా చేయను అని చెప్పింది. కారణం ఏంటి?