Karthikeya 2: పుష్ప మాదిరి కార్తికేయ 2 అక్కడ సంచలనాలు చేయనుందా!

By Sambi ReddyFirst Published Aug 15, 2022, 10:23 PM IST
Highlights


తెలుగులో కార్తికేయ సాలిడ్ వసూళ్లతో నడుస్తుండగా హిందీలో కూడా సత్తా చాటే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటిరోజుతో పోల్చితే భారీ గ్రోత్ సెకండ్ డే కనిపించింది. 
 

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ కార్తికేయ 2. నిఖిల్(Nikhil) హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించారు. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కార్తికేయ తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రం పై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు, కృష్ణతత్త్వాన్ని ఆలోచింపజేసే ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

మూవీపై మొదటి నుండి నమ్మకంతో ఉన్న టీమ్ హిందీలో కూడా విడుదల చేశారు. కనీస ప్రమోషన్స్ కూడా ముంబైలో నిర్వహించలేదు. అయితే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో కార్తికేయ 2(Karthikeya 2) సంచలన వసూళ్లు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ చిత్రాలతో పోటీపడింది. అలాగే మినిమమ్ థియేటర్స్, షోస్ కూడా పడలేదు. దీంతో ఫస్ట్ డే కేవలం రూ. 7 లక్షల వసూళ్లు దక్కాయి. 

మూవీ అక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా రెండో రోజు అనూహ్యంగా పుంజుకుంది.  సెకండ్ డే కార్తికేయ 2 రూ. 28 లక్షలు వసూలు చేసింది. మూడో రోజు ఆదివారం మరింత పెరిగే అవకాశం కలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం ఈ మూవీకి కలిసి రావచ్చు. ఇక బాలీవుడ్ లో వంద కోట్ల వసూళ్లు సాధించిన పుష్ప సైతం ఇలానే మెల్లగా పుంజుకుంది. ఫస్ట్ డే పుష్ప చిత్రం కేవలం రూ. 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. డిజాస్టర్ అవుతుంది అనుకుంటే పెద్ద పెద్ద చిత్రాలను వెనక్కి తోసి సూపర్ హిట్ నమోదు చేసింది. కార్తికేయ 2 కూడా ఇదే తరహా మ్యాజిక్ చేసే అవకాశాలు కలవు. 
 

click me!