'మా' ప్రెసిడెంట్ గా జయసుధ..?

By Udayavani DhuliFirst Published Sep 6, 2018, 12:20 PM IST
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీన్ని వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటే.. శివాజీరాజా, నరేష్ మీడియాకెక్కి నానా రచ్చ చేశారు. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీన్ని వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటే.. శివాజీరాజా, నరేష్ మీడియాకెక్కి నానా రచ్చ చేశారు. ఇప్పుడు సినీ పెద్దలు, ప్రజలు శివాజీరాజాకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ నరేష్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఆయన అడిగినట్లుగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి నిజాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

అయితే శివాజీరాజాకి బదులుగా 'మా' ప్రెసిడెంట్ గా జయసుధని తీసుకోవాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. 'మా'తో కలిసి కొన్నేళ్ల పాటు సేవలు చేసిన జయసుధ అయితే ఆ పదవికి న్యాయం చేయగలదని ఆమె పేరుని సూచిస్తున్నారు. గతంలో కూడా జయసుధ 'మా' ప్రెసిడెంట్ గా చేయాలని ఎలెక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ ప్రెసిడెంట్ అయ్యారు.

అయితే ఇప్పుడు ఆమెకు ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించే ఆలోచన లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గతంలో కూడా ఓసారి ఆమె ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు, బరువులు తీసుకోకూడదని అనుకుంటున్నట్లు, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నట్లు వెల్లడించారు. కాబట్టి ఆమె ప్రెసిడెంట్ గా చేయడానికి అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా.. మా వివాదంపై చిరంజీవి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే మాత్రం కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకున్నారట!

ఇవి కూడా చదవండి..

శివాజీరాజాపై చిరు గుస్సా.. మరి రాజీనామా చేస్తాడా..?

'మా' కాంట్రవర్సీ.. మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చేశాడు!

'మా' వివాదం.. చిరంజీవిని ఇరికిస్తున్నారా..?

ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్లు.. 'మా' వివాదంపై శ్రీరెడ్డి కామెంట్స్!

మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

click me!