డబ్బులిచ్చారు.. ముద్దులు పెట్టా.. హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు!

By Udayavani DhuliFirst Published Sep 6, 2018, 11:53 AM IST
Highlights

ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఎవరిచ్చారని ఆలోచిస్తున్నారా..? ఇంకెవరు యూత్ హాట్ ఫేవరెట్ హెబ్బా పటేల్. 'కుమారి 21 ఎఫ్' సినిమా తరువాత యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. 

ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఎవరిచ్చారని ఆలోచిస్తున్నారా..? ఇంకెవరు యూత్ హాట్ ఫేవరెట్ హెబ్బా పటేల్. 'కుమారి 21 ఎఫ్' సినిమా తరువాత యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు బోల్తా కొత్తడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

నిజానికి ఆమెకు అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. మళ్లీ ఇప్పుడు '24 కిస్సెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో లెక్కకు మించి రొమాంటిక్ సీన్లు దర్శనమిస్తున్నాయి. టైటిల్ కి తగ్గట్లే ఘాటు లిప్ లాక్ సీన్లు కూడా ఉన్నాయి. ఈ విషయంపై హెబ్బా బోల్డ్ కామెంట్స్ చేసింది. అన్ని ముద్దులు ఎలా పెట్టారని ప్రశ్నించగా..

''డబ్బులు తీసుకొని చేసే.. బాగానే ఉంది'' అంటూ కామెంట్ చేసింది. హెబ్బా నుండి ఇలాంటి సమాధానం ఊహించని వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయం బయటకి రావడంతో సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు వెల్లువెత్తాయి. డబ్బిస్తే ఏమైనా చేస్తావా..? అంటూ విమర్శించడం మొదలు పెడుతున్నారు. బహిరంగంగా ఇలాంటి మాటలు మాట్లాడేప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలని ఆమెకు సలహాలు ఇస్తున్నారు.   
 

click me!