సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకోవడానికి వచ్చా.. రచ్చ చేసిన యువతి!

Published : Sep 06, 2018, 11:41 AM ISTUpdated : Sep 09, 2018, 12:04 PM IST
సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకోవడానికి వచ్చా.. రచ్చ చేసిన యువతి!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానని 24 సంవత్సరాల యువతి చేసిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీల ఇళ్లపై ఈ రకమైన దాడులు కామనే.. తారపై తమకున్న పిచ్చి అభిమానంతో ఇలా చేస్తుంటారు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానని 24 సంవత్సరాల యువతి చేసిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీల ఇళ్లపై ఈ రకమైన దాడులు కామనే.. తారపై తమకున్న పిచ్చి అభిమానంతో ఇలా చేస్తుంటారు. అయితే ఈసారి సల్మాన్ కోసం వచ్చిన అమ్మాయికి నిజంగానే మానసిక స్థితి సరిగ్గా లేదని వైద్యులు నిర్ధారించారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల ఓ యువతీ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న సల్మాన్ ఖాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్మెంట్ కి వచ్చింది. తాను సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానంటూ అతడి ఇంట్లోకి ప్రవేశించే సాహసం చేసింది.

సెక్యూరిటీ గార్డులు ఆమెను అడ్డుకోవడంతో సల్మాన్ ఇంటి వద్ద ఉన్న బ్రిడ్జీపై తిరుగుతూ హల్చల్ చేసింది. దీంతో ముంబై పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి పంపగా.. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని తేల్చారట. ఆమె వద్ద దొరికన ఫోన్ ఆధారంగా ఇంట్లో వాళ్లకి కబురు చేసి అమ్మాయిని అప్పగించారు. 

PREV
click me!

Recommended Stories

The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌
Dhurandhar Day 39 Collections: డేంజర్‌ జోన్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` రికార్డులు.. ధురంధర్‌ 39 రోజుల బాక్సాఫీసు వసూళ్లు