రేపటి నుంచే 'రామాయణం' రీ టెలీకాస్ట్, ప్రభుత్వ నిర్ణయం

By Surya PrakashFirst Published Mar 27, 2020, 11:16 AM IST
Highlights

రామాయణ్‌ సీరియల్‌ 1987 నుంచి 1988 వరకు ప్రతి ఆదివారం దూరదర్శన్‌లో ప్రసారమయ్యేది. ప్రముఖ హిందీ దర్శకుడు రామానంద్‌సాగర్‌ దర్శకత్వంలో నిర్మితమైన సీరియల్‌లో సీతగా దీపికా చికాలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లహరి, హనుమంతునిగా దారాసింగ్‌.. తదితరులు నటించారు. 

మీకు రామాయణం సీరియల్‌ గుర్తుందా.. 1990లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ధారావాహిక.. ప్రతి ఆదివారం అప్పట్లో ఈ సీరియల్‌ను దూరదర్శన్ లో  ప్రసారం అయ్యింది.  ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుని టెలివిజన్‌ రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది.ఆ సమయంలో ట్రాఫిక్‌ కూడా లేకుండా రోడ్లు నిర్మానుష్యంగా మారేవి. ఆ సీరియల్‌లో రాముడిగా అరుణ్‌గోవిల్‌ నటనపై జాతి ప్రశంసల జల్లు కురిపించింది. ఆయన ఎక్కడకు వెళ్ళినా రాముడే వచ్చాడని ప్రజలు చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చేవారు.  ఆ స్దాయి పేరు తెచ్చిపెట్టిన ఈ సీరియల్ మరోసారి ప్రసారం కాబోతోంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా హిందువులు ఎంతో ఆసక్తిగా చూసే రామాయణం సీరియల్‌ను మరోసారి టీవీల్లో ప్రసారం చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రసారశాఖమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ శుక్రవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.  

ఎంతో సంతోషంగా ఉంది.. ప్రజల డిమాండ్‌ మేరకు రామాయణాన్ని మరోసారి టీవీల్లో ప్రచారం చేస్తున్నాం. మార్చి 28 (శనివారం) నుంచి  ఈ సీరియల్‌ ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్‌ (దూరదర్శన్‌) చానల్‌లో ‍ప్రసారం కానుంది’ అని కేంద్రమంత్రి తెలిపారు.

రామాయణ్‌ సీరియల్‌ 1987 నుంచి 1988 వరకు ప్రతి ఆదివారం దూరదర్శన్‌లో ప్రసారమయ్యేది. ప్రముఖ హిందీ దర్శకుడు రామానంద్‌సాగర్‌ దర్శకత్వంలో నిర్మితమైన సీరియల్‌లో సీతగా దీపికా చికాలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లహరి, హనుమంతునిగా దారాసింగ్‌.. తదితరులు నటించారు. అనంతర కాలంలో దీపికా చికాలియా ఎంపీగా కూడా గెలుపొందారు. 

click me!