పవన్ మాజీ భార్య.. రేణుదేశాయ్ కి రెండో పెళ్లి?

Published : Jun 16, 2018, 04:35 PM ISTUpdated : Jun 16, 2018, 04:45 PM IST
పవన్ మాజీ భార్య.. రేణుదేశాయ్ కి రెండో పెళ్లి?

సారాంశం

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరో పెళ్లికి రెడీ అవుతోందా..?

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరో పెళ్లికి రెడీ అవుతోందా..? అంటే అవుననే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..? తన పిల్లలకు తనకు ఓ తోడు కావాలంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో ఆమెపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. రెండో పెళ్లి చేసుకోవద్దని కొందరు అభిమానులు వారించారు కూడా.. ఇప్పుడు వారందరికీ ఓ పోస్ట్ తో సమాధానమిచ్చింది రేణు.

తను ఇన్నాళ్లు వెతికిన ప్రేమ దొరికిందంటూ.. సోషల్ మీడియాలో వెల్లడించింది. ఓ వ్యక్తి చేయి పట్టుకొని దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు రేణుదేశాయ్. అంతేకాదు అతడి కోసం ఓ కవిత కూడా రాశారు. నా చేయి పట్టుకొని.. ఎప్పటికీ వదలకు.. అంటూ ఆ కవితలో రాసుకొచ్చారు. అయితే రేణు మాత్రం అతడే తనకు కాబోయే భర్త ని మాత్రం చెప్పలేదు. ఆ వ్యక్తి ఎవరనే విషయంలో క్లారిటీ కూడా ఇవ్వలేదు.

అయితే ఈ పోస్ట్ పై  స్పందించిన నెటిజన్లు అనూహ్యంగా ఆమెకు శుభాకంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. మీరొక స్ట్రాంగ్ విమెన్.. ఎందరికో మీరే ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు