Bollywood Honey Trap : 100మంది సెలబ్రిటీల నగ్న వీడియోలు లీక్ !

By AN TeluguFirst Published Aug 21, 2021, 7:55 AM IST
Highlights

నిందితుల్లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాగా ఒకరు మైనర్. వీరి నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, 12 నకిలీ ఖాతాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో టాప్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్, రిచ్ ఉమెన్, మెన్ ఉన్నారని ముంబై పోలీసులు తెలిపారు. 

బాలీవుడ్లో హనీట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఏకంగా వందమంది సెలబ్రిటీల నగ్న వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ కు దిగారు సైబర్ నేరగాళ్లు. సెలబ్రిటీ లో ఫిర్యాదులతో ముంబై సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఓ ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోల్లో బాలీవుడ్ కు చెందిన 100 మంది సినీ, టీవీ నటులు ఉన్నారు.

నిందితుల్లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాగా ఒకరు మైనర్. వీరి నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, 12 నకిలీ ఖాతాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో టాప్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్, రిచ్ ఉమెన్, మెన్ ఉన్నారని ముంబై పోలీసులు తెలిపారు. 

నిందితులు మొదటగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సెలబ్రిటీలతో స్నేహం చేస్తారు. డాక్టర్, లాయర్, బిజినెస్ మాన్ అని చెప్పి వారిని నమ్మిస్తారు.  మెల్లిగా వీడియో కాల్ చేసి క్లోజ్ అవుతారు. నమ్మకం కుదిరాక.. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడి.. రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ దిగుతారు.  డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆతర్వాత వీడియోలను డార్క్ వెబ్ వంటి ఫోర్న్ సైట్లకు అమ్ముతారు.  అందుకే అపరిచితులు  ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. 
 

click me!