త్రివిక్రమ్ కృతజ్ఞత చూపిస్తాడా.. తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత గట్టి ప్రయత్నం..

Published : May 18, 2024, 08:37 PM IST
త్రివిక్రమ్ కృతజ్ఞత చూపిస్తాడా.. తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత గట్టి ప్రయత్నం..

సారాంశం

త్రివిక్రమ్ తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ కాంబినేషన్ పక్కాగా కుదురుతుందని చెప్పలేని పరిస్థితి. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం చిత్రం ఆశించిన రేంజ్ లో ఆడలేదు అనేది వాస్తవం. దీనితో తదుపరి చిత్రం ఏ హీరోతో చేయాలి.. ఎలాంటి కథతో చేయాలి అనే కన్ఫ్యూజన్ లో త్రివిక్రమ్ ఉన్నారట. 

త్రివిక్రమ్ తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ కాంబినేషన్ పక్కాగా కుదురుతుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అల్లు అర్జున్ కోసం అట్లీ, మురుగదాస్ లాంటి డైరెక్టర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఒక వేళ బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఖరారు అయినా తప్పనిసరిగా అది పాన్ ఇండియా చిత్రమే కావాలి. 

భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కించాలంటే త్రివిక్రమ్ చాలా టైం తీసుకుంటారు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తో ఒక మీడియం బడ్జెట్ చిత్రాన్ని రామ్ హీరోగా నిర్మించాలని స్రవంతి రవికిశోర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

త్రివిక్రమ్ కి దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది స్రవంతి రవికిశోరే. త్రివిక్రమ్ నువ్వే నువ్వే చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించారు. త్రివిక్రమ్ కథ అందించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రానికి కూడా స్రవంతి రవికిశోర్ ఒక నిర్మాత. కాబట్టి త్రివిక్రమ్ తో ఆయనకి మంచి అనుబంధం ఉంది. 

తనకి అవకాశం ఇచ్చిన నిర్మాత కాబట్టి ఆయన అడిగితే త్రివిక్రమ్ కృతజ్ఞత చూపించాల్సి ఉంటుంది. అది హీరో రామ్ కి కలసి వచ్చే అంశం. అయితే త్రివిక్రమ్ ఈ టైం లో టైర్ 2 హీరోతో ఎందుకు అని భావిస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా వీలైనంత త్వరలో త్రివిక్రమ్ తదుపరి చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి