జిమ్ వేర్ లో సూపర్ హాట్ గా రాశి ఖన్నా... వైరల్ గా ఇంస్టాగ్రామ్ వీడియో

By team teluguFirst Published Jul 8, 2021, 12:00 PM IST
Highlights

అందమైన శరీరం కోసం హీరోయిన్స్ జిమ్స్ లో చెమటలు చిందిస్తూ ఉంటారు. గ్లామర్ ఫీల్డ్ లో అందమైన శరీరాకృతి చాలా అవసరం. జిమ్ వేర్ లో వర్కవుట్స్ చేస్తున్న రాశి ఖన్నా హాట్ వీడియో వైరల్ గా మారింది.

దూరం నుండి హీరోయిన్స్ జీవితాలు చూసినవారికి వాళ్ళకేమి లగ్జరీ లైఫ్స్ అనుకుంటారు. కానీ ఆ లగ్జరీ లైఫ్ కోసం వాళ్ళు పడే కష్టాలు అనేకం. ముఖ్యంగా అందం, చక్కని ఆహార్యం కోసం హీరోయిన్స్ చేసే త్యాగాలు ఎన్నో. హీరోయిన్స్ ఏమాత్రం బరువు పెరిగినా వాళ్ళ కెరీర్ ఖతం అయినట్లే. షేప్ అవుట్ బాడీలో ఉన్న అమ్మాయిలను హీరోలు, దర్శక నిర్మాతలు పట్టించుకోరు. దాని కోసం గంటల తరబడి కసరత్తులు, యోగాలు చేస్తూ సన్నజాజి శరీర ఆకృతి కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇష్టమైన ఆహార పదార్థాలు కూడా వదిలేస్తారు. 


కాగా హీరోయిన్ రాశి ఖన్నా సైతం ప్రతిరోజూ కఠిన వర్కవుట్స్ చేస్తూ ఉంటారు. శరీర తీరు కారణంగా రాశి వ్యాయామం ఆపేస్తే త్వరగా బరువు పెరుగుతారు. ఆ మధ్య బొద్దుగా మారిన ఆమె వ్యాయామం ద్వారా బరువు తగ్గారు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియో పంచుకుంది రాశి. జిమ్ వేర్ లో రాశి వర్కవుట్ మూమెంట్స్ హాట్ హాట్ గా ఉన్నాయి. అదే సమయంలో కెరీర్ కోసం ఇంత కష్టపడుతుందా అనిపిస్తుంది. 


రాశి కెరీర్ పరంగా మంచి ఫార్మ్ లో ఉన్నారు. గోపిచంద్ పక్కా కమర్షియల్, నాగ చైతన్య థాంక్ యూ చిత్రాలు చేస్తున్న ఆమె తమిళంలో ఏకంగా నాలుగు చిత్రాలు చేస్తున్నారు. అలాగే ఓ మలయాళ చిత్రం కూడా ఆమె ఖాతాలో ఉంది. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాకు దగ్గరగా వెళ్లి అవకాశం చేజార్చుకున్న రాశి, టూ టైర్ హీరోల సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగులో ఆమె ఫేడ్ అవుట్ దశకు చేరుకోగా, తమిళంలో ఎదిగే ప్రయత్నాలలో ఉన్నారు. 

click me!