అలాంటి పరిస్థితి వస్తే నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటాః నాని సంచలన వ్యాఖ్యలు

By Aithagoni RajuFirst Published Sep 1, 2021, 6:53 PM IST
Highlights

తాను సినిమా ఇండస్ట్రీలో భాగమన్నారు. తాను తెలుగు సినిమాలో భాగమని, వారున్న పరిస్థితుల్లో తనపై విమర్శలు చేశారని, వారి బాధని తాను అర్థం చేసుకుంటానని తెలిపారు. ఆ సిచ్చువేషన్‌లో ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారని తెలిపారు.

నాని ప్రస్తుతం `టక్‌ జగదీష్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్‌ 10న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో నాని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి ఆయన స్పందించారు. థియేటర్ల విషయంలో తనపై వచ్చిన కామెంట్లు, విమర్శలపై స్పందించారు. 

తాను సినిమా ఇండస్ట్రీలో భాగమన్నారు. తాను తెలుగు సినిమాలో భాగమని, వారున్న పరిస్థితుల్లో తనపై విమర్శలు చేశారని, వారి బాధని తాను అర్థం చేసుకుంటానని తెలిపారు. ఆ సిచ్చువేషన్‌లో ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారని తెలిపారు. అయితే నన్ను బయటి వాడిలా ట్రీట్‌ చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. 

దీంతోపాటు తన సినిమా థియేటర్లు కాకుండా, ఓటీటీలో విడుదల చేయడంపై, తనని బ్యాన్‌ చేయాలనే వాదనలపై నాని మాట్లాడుతూ, పరిస్థితులన్నీ బాగుండి, జనం థియేటర్ కి వస్తే, అప్పుడు కూడా నేను థియేటర్లో కాకుండా ఓటీటీలో తన సినిమాని విడుదల చేస్తే అప్పుడు ఎవరో నన్ను బ్యాన్‌ చేయడం కాదు, నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా గురించి చెబుతూ, ఇది మన చిన్ననాటి కథలను చెప్పే చిత్రమిది. ఒకప్పుడు మన జీవితంలో జరిగిన విషయాలే ఇందులో ప్రతిబింబిస్తాయని, అవి కొత్తగా అనిపిస్తాయని తెలిపారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ని కొత్తగా ఆవిష్కరించే చిత్రమన్నారు. దర్శకుడు శివ నిర్వాణలోని మరో యాంగిల్‌ని, యాక్షన్‌ యాంగిల్‌ని ప్రతిబింబిస్తుందన్నారు. 

click me!