'సీటిమార్'కి ఓటిటి ఆఫర్స్ వచ్చాయి, కానీ.. పరోక్షంగా నానికి గోపీచంద్ సపోర్ట్

By telugu teamFirst Published Sep 8, 2021, 2:40 PM IST
Highlights

మాస్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటీమార్. గోపీచంద్ కి జోడిగా తమన్నా నటించింది. కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం ఇది. 

మాస్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటీమార్. గోపీచంద్ కి జోడిగా తమన్నా నటించింది. కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో సంపత్ నంది తెరకెక్కించిన చిత్రం ఇది. 

ఈ చిత్రంలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటించాడు. వినాయక చవితి కానుకగా సీటీమార్ చిత్రం థియేటర్స్ లో సెప్టెంబర్ 10న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ ప్రచార కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. ఇటీవల ఓటిటి, థియేటర్ వ్యవస్థపై పెద్ద చర్చే జరుగుతోంది. దీనిపై గోపీచంద్ స్పందించాడు. 

ఓటిటి రిలీజ్ లని గోపీచంద్ తప్పుబట్టలేదు. ఇటీవల నాని నటించిన టక్ జగదీశ్ చిత్రం ఓటిటిలో కానుండడంతో పెద్ద వివాదం రేగింది. నానిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ విషయంలో గోపీచంద్ నానికి పరోక్షంగా మద్దతు తెలిపారు. 

ప్రతి ఒక్క నిర్మాత తన చిత్రానికి థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తాడు. కానీ పరిస్థితుల వల్ల కొన్ని చిత్రాలు ఓటిటిలో రిలీజ్ కాక తప్పడం లేదు. దానిని నేను తప్పుబట్టను. నిర్మాత కష్టాలు ఏంటో తెలియాలంటే మనం కూడా నిర్మాత కావాలి అని గోపీచంద్ తెలిపాడు. గోపీచంద్ వ్యాఖ్యలు నానికి పరోక్షంగా మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయి. 

టక్ జగదీష్ విషయంలో కూడా నాని ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే. ఓటిటి రిలీజ్ ఇష్టం లేకున్నా నిర్మాతల కోసం తప్పడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇక సీటీమార్ చిత్రానికి కూడా ఓటిటి ఆఫర్స్ వచ్చాయని, కానీ సీటీమార్ చిత్రాన్ని థియేటర్స్ లో చూస్తేనే బావుంటుందని గోపీచంద్ అన్నారు. అందుకే ఓటిటి ఆఫర్స్ రిజెక్ట్ చేసినట్లు గోపీచంద్ తెలిపాడు. 

click me!