ఎవర్‌గ్రీన్‌ ఛార్మింగ్‌ సూపర్‌స్టార్‌ః మహేష్‌కి కేటీఆర్‌, చిరు, వెంకీ, ఎన్టీఆర్‌, రామ్‌ బర్త్ డే విషెస్

By Aithagoni RajuFirst Published Aug 9, 2021, 12:05 PM IST
Highlights

మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీలు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. చిరంజీవి, మంత్రి కేటీఆర్‌, వెంకటేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌, నవీన్‌ పొలిశెట్టి ట్వీట్టర్‌ ద్వారా విష్‌ చేశారు.

సూపర్‌ స్టార్‌మహేష్‌బాబు నేడు(ఆగస్ట్‌9) తన 46వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియా మొత్తం మహేష్‌ బర్త్ డే ట్వీట్స్, `సర్కారు వారి పాట` బర్త్ డే బ్లాస్టర్ తో మారుమోగిపోతుంది. మరోవైపు సెలబ్రిటీల విషెస్‌ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్‌కి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు. నైస్‌ సూపర్‌ స్టార్ట్ అని, ఎప్పటికీ యంగ్‌గానే ఉంటారని అన్నారు. 

Happy birthday to the nicest superstar I know & the forever young 🌟

Many returns of the day brother

— KTR (@KTRTRS)

మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవర్‌గ్రీన్‌ ఛార్మర్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. స్టయిల్‌, పదార్థానికి ప్రాణాంతకమైన కాంబో అని, ఈ ఏడాది మీకు బ్లాక్‌బస్టర్‌గా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

Happy Birthday to the Evergreen Charmer SSMB ! A lethal combo of Style and Substance! Have a Blockbuster year ahead! 💐💐 Many Many Happy Returns!

— Chiranjeevi Konidela (@KChiruTweets)

మరోవైపు వెంకటేష్‌ తన వెండితెర చిన్నోడు(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మహేష్‌ని వెంకీ పిలిచే పేరు)కి బర్త్ డే విషెస్‌ తెలిపారు. `హ్యాపీ బర్త్డ్‌ డే చిన్నోడా. నీకు శాంతి, సంతోషంతోపాటు కెరీర్‌ బాగుండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

Happy Birthday Chinnoda ! Wishing you peace, happiness and a fabulous year ahead ! pic.twitter.com/ypihfbp3uZ

— Venkatesh Daggubati (@VenkyMama)

ఎన్టీఆర్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు.

 

Wishing you a very Happy Birthday anna!! Have a great year ahead

— Jr NTR (@tarak9999)

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌పోతినేని సైతం మహేష్‌కి విషెస్‌ తెలిపారు. `సర్కారువారి పాట` ట్రైలర్‌ అదిరిపోయిందని తెలిపారు. 

Here’s wishing our SuperStar a very happy birthday..what a kickass trailer! 🔥

Love

— RAm POthineni (@ramsayz)

`జాతిరత్నాలు`తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన నవీన్‌ పొలిశెట్టి ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలియజేశారు. `ఈ ఏడాది ఇష్టమైన సందర్భాల్లో ఒకటి మీరు `జాతిరత్నాలు` సినిమాని ఇష్టపడటంపై మీ స్పందన. మాకు ఎంతో ఇన్‌స్పైర్‌ చేశారు. టీజర్‌ చూశారు కదా. నిజంగానే దిష్టి తీయించుకోండి సర్‌` అని తెలిపారు.

Happy Birthday sir. One of fav moments this year was your reaction on how much you loved Jaathi Ratnalu. It inspired me a lot to do more exciting work. Teaser chusaru kada. Nijangane dishti teeyinchukondi sir :)

— Naveen Polishetty (@NaveenPolishety)
click me!