‘డీజే టిల్లు’ సీక్వెల్ కన్ఫమ్.! షూటింగ్ ప్రారంభంపై అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగవంశీ..

Published : Jun 25, 2022, 02:47 PM IST
‘డీజే టిల్లు’ సీక్వెల్ కన్ఫమ్.! షూటింగ్ ప్రారంభంపై అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగవంశీ..

సారాంశం

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ (Naga Vamshi) తమ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్ లో క్రేజీ ప్రాజెక్ట్ లను రూపొందిస్తూ ఆడియెన్స్ ను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు.   

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ హల్ చల్ చేస్తోంది. ఒక సినిమా వచ్చి అది హిట్ అయ్యిందంటే చాలు.. దానికి పక్కాగా సీక్వెల్ తయారు అవుతుంది. ఏమాత్రం వెనకాముందు ఆలోచించకుండా ఆఢియెన్స్ కోరిక మేరకు సీక్వెల్ లోకి దూకేస్తున్నారు. అయితే ఈ ఏడాది టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో ‘డీజే టిల్లు’ ఒకటి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ (Naga Vamshi) రూపొందించారు.  ఈ చిత్రంలో సిద్ధు జొన్నల గడ్డ ప్రధాన పాత్రలో నటించాడు. 

Dj Tilluతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు కొట్టాడు  సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ . సెకండ్ వేవ్ త‌ర్వాత బాక్సాపీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ సినిమాల్లో  ఇది కూడా ఒక‌టి. గుంటూరు టాకీస్ ఫేం సిద్ధు ఈ మూవీలో ప‌క్కా హైద‌రాబాదీ స్టైల్‌లో కామెడీ ట‌చ్‌తో చేసిన యాక్టింగ్ యూత్ కు పిచ్చెక్కించింది. యంగ్ స్టార్స్.. కాలేజీ పిల్లలు డీజే టిల్లు సినిమాను బాగా ఆదరించారు. ముఖ్యంగా తాజాగా ఈ చిత్రం సాంగ్స్ దుమ్మలేపాయి. ఇప్పటికీ డీజే టిట్టు సాంగ్స్ మోత మోగుతున్నాయి. అలాగే టిల్లు మేనరిజం కూడా ఇంకా ట్రెండ్ లోనే ఉంది. చిత్రంలో సిద్ధు చెప్పిన ‘అట్లుంటది మనతోటి’ అనే డైలాగ్ కూడా వాడుకలోనే ఉంది. 

అయితే డీజే టిల్లు ఫీవర్ తగ్గకముందే సెకండ్ పార్ట్ ను కూడా తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నారు  మేకర్స్. ఫ‌స్ట్ పార్ట్  తెర‌కెక్కించిన సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే సెకండ్ పార్ట్ కూడా రానుందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే సిధ్దు అండ్ టీం స్క్రిప్టు ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నారంట. తాజాగా నాగ వంశీ కూడా అదిరిపోయే అనౌన్స్ చేశారు. ‘ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీ... రౌండ్ 2 కోసం సిద్ధమవుతోంది..  ఆగస్ట్‌లో క్రేజీ అడ్వెంచర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.’ అని అప్డేట్ అందించారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఆ ఫ్రాంచైజీ డీజే టిల్లునే అంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?