అభిమానులు, ప్రజానికానికి చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ విషెస్‌.. బోల్డ్ మెసేజ్‌

By Aithagoni RajuFirst Published Jan 1, 2021, 8:09 AM IST
Highlights

మన జీవితంలోకి ఎన్నో కష్టాలను తీసుకొచ్చి, మనకో గుణపాఠాలను, అనుభవాలను మిగిల్చిన 2020కి గుడ్‌బై చెబుతున్నాడు సెలబ్రిటీలు. అదే సమయంలో 2021కి ఉత్సాహంతో స్వాగతం పలుకుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌  కొత్త సంవత్సర సందేశాన్ని అందించారు. 

మన జీవితంలోకి ఎన్నో కష్టాలను తీసుకొచ్చి, మనకో గుణపాఠాలను, అనుభవాలను మిగిల్చిన 2020కి గుడ్‌బై చెబుతున్నాడు సెలబ్రిటీలు. అదే సమయంలో 2021కి ఉత్సాహంతో స్వాగతం పలుకుతున్నారు. చిరంజీవి ఆడియో ద్వారా తన కొత్త సంవత్సర సందేశాన్ని అందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, `థ్యాంక్యూ 2020. మాకు ఓర్పుని నేర్పావు. మా జీవితాలను మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావ్‌. కొత్త సంవత్సరానికి స్వాగతం. ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలని, బోలెడంత సంతోషాలను ఇవ్వాలి. మీ కలలన్నీ నిజం కావాలి. అలాగే కోవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా రావాలి. ప్రతి ఒక్కరికి 2021 సంవత్సర శుభాకాంక్షలు` అని పేర్కొన్నారు. 

Wishing a Very Happy, Healthy & Fulfilling New Year 2021 for you and all your dear ones!🎉🎉 pic.twitter.com/ckNl8jNdKp

— Chiranjeevi Konidela (@KChiruTweets)

మరోవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా న్యూ ఇయర్‌ విషెస్‌ని ముందుగానే తెలియజేశారు. ఆయన ఓ ప్రకటన రూపంలో విడుదల చేశారు. `ప్రియమైన అందరికీ.. ఈ సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా, నాకు నిత్యం ఆనందాన్ని, మానసిక బలాన్ని అందిస్తున్న నా కుటుంబం, నా మిత్రులు, నా నిర్మాతలు, నా దర్శకులు, అందరికంటే ముఖ్యంగా నా అభిమానులకు బెస్ట్ విషెస్‌ తెలియజేస్తున్నా`. 

ఈ ఏడాది మనందరికీ ఎన్నో భరించలేని కష్టాలని పరిచయంచేసింది. కానీ మనం అందరం రెట్టింపు బలంతో ముందుకు సాగడానికి సిద్దం అయ్యాం. మనం అందరి బంధం మరింత దృఢంగా మారాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం. మీ అందరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు` అని పేర్కొన్నారు రామ్‌చరణ్‌. 

Happy and Healthy 2021 to each and every one of you !!! pic.twitter.com/8fSRUd1mbp

— Ram Charan (@AlwaysRamCharan)

యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ చెబుతూ, 2020 ఏడాది అన్నింటికంటే భిన్నమైనది. ప్రతి ఏడాది చాలా నేర్చుకుంటాం కానీ ఇది పోరాడేలా చేసింది. మహమ్మారి ప్రపంచం మొత్తానికి అనేక సవాళ్లని విసిరింది. నేను కూడా అనేక సవాళ్లని ఫేస్‌ చేశాను, అది వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా. దాన్ని ఓవర్ కమ్ చేసి ముందుకు సాగాలంటూ ఓ నోట్‌ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌ కరోనాతో బాధపడుతున్నారు. అయితే ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపిన విషయం తెలిసిందే.  

🌟🌟🌟 pic.twitter.com/fm2PI00mCu

— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej)
click me!