`మా` ప్రతిష్టని దెబ్బతీసే ఏ ఒక్కరిని ఊపేక్షించరాదుః చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు.. కృష్ణంరాజుకి లేఖ

By Aithagoni RajuFirst Published Aug 9, 2021, 7:10 PM IST
Highlights

`మా` ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఎన్నికలు పెద్ద చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్‌ స్పందించారు. కృష్ణంరాజుకి లేఖ రాశారు. ఇందులో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఇటీవల `మా` ఎన్నికలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం బాడీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ,జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు సైతం తమ ప్రకటనలు, వ్యాఖ్యలతో హాట్‌ టాపిక్‌గా మారింది. `మా` ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఎన్నికలు పెద్ద చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్‌ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

చిరంజీవి `మా` క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకి ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. `మా` అధ్యక్ష ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపినట్టు తెలుస్తుంది. అదే సమయంలో సభ్యుల బహిరంగ ప్రకటనలతో `మా` ప్రతిష్ట మసకబారుతుందని ఆయన ఆవేదన చెందారు. `మా` ప్రతిష్టని దెబ్బతీసే ఏ ఒక్కరిని ఊపేక్షించవద్దు అని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజుని చిరంజీవి కోరినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఇప్పటికే `మా` ప్రస్తుత కమిటీ కాలపరిమితి మార్చితోనే పూర్తయ్యింది.కరోనా వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. అయితే `మా` అధ్యక్ష బరిలో ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. 

click me!