విజయనిర్మల గారి మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటు.. చిరంజీవి!

Published : Jun 27, 2019, 11:36 AM IST
విజయనిర్మల గారి మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటు.. చిరంజీవి!

సారాంశం

విజయనిర్మల గారి లాంటి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం

అరుదైన ద‌ర్శ‌క న‌టీమ‌ణి శ్రీమ‌తి విజ‌య నిర్మ‌ల గారి హ‌ఠాన్మ‌ర‌ణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తి గారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల. అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామినిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ కృష్ణ‌గారికి, న‌రేష్ కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?