ఒక దెబ్బకు రెండు పిట్టలు... చిరంజీవి బ్రదర్స్ ఏం ప్లాన్ చేశారో కదా!

By Sambi ReddyFirst Published Aug 21, 2022, 4:49 PM IST
Highlights


రేపు మెగాస్టార్ పుట్టినరోజు. ఆయన 67వ బర్త్ డే జరుపుకోనున్నారు. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో చిరంజీవి బర్త్ డే వేడుకలు ప్లాన్ చేశారు. అది ఎవరో కాదు తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్. చిరంజీవి బర్త్ డే కార్నివాల్ అంటూ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. 
 


ఇదంతా ఆయనపై ప్రేమతో నాగబాబు చేస్తున్నదనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అంతా రాజకీయ క్రీడ. రాజకీయం కోసం పవన్, నాగబాబు అన్న చిరంజీవి బర్త్ డే వేడుకలు వినూత్నంగా ప్లాన్ చేశారు.  అవకాశం, సందర్భాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. చిరంజీవి బర్త్ డే వేడుకలు ఈ ఏడాది వాళ్లకు చాలా స్పెషల్. నాగబాబు భారీ ఎత్తున నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కార్నివాల్ పేరుతో ఏదేదో చేస్తున్నాడు. 

ఇన్నేళ్ల కాలంలో నీడనిచ్చిన చిరంజీవి బర్త్ డే ఇలా చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడెందుకు చేస్తున్నారు? అంటే క్లియర్ గా అర్థం అవుతుంది. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం. కాపు వర్గాన్నే నమ్ముకున్న జనసేన కుయుక్తులలో భాగం. ఆ సామాజిక వర్గం నుండి తిరుగులేని శక్తిగా ఎదిగిన చిరంజీవి సీఎం కావాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ అది జరగలేదు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారు. దానికి కాపు వర్గం సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆయన సామాజిక వర్గం ఎక్కువగా నమ్మే చిరంజీవి ప్రత్యర్థుల పంచన చేరారు.

చిరంజీవి సీఎం వైఎస్ జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇది జనసేన నాయకులైన నాగబాబు, పవన్ కళ్యాణ్ కి నచ్చడం లేదు. వైసీపీలో ఉన్న కాపు వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను జనసేనకు దూరం చేస్తున్నారని నమ్ముతున్న జనసేన, చిరంజీవి బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం ద్వారా వాళ్లకు దగ్గర కావచ్చని నమ్ముతున్నారు. దానిలో భాగంగానే చిరంజీవి బర్త్ ద్య కార్నివాల్ వేడుకలని కొందరి అభిప్రాయం.కాగా తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చిరంజీవికి విబేధాలు తలెత్తాయనే ఓ వాదన ప్రచారం అవుతుంది. చిరంజీవి కారణంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు సీఎం జగన్ కి దగ్గర అవుతుందని వారు భావిస్తున్నారు. చిరంజీవి బర్త్ డే గ్రాండ్ గా నిర్వహించడం ద్వారా ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టాలని నాగబాబు, పవన్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

click me!