చేతిలో 50 వేలు కూడా లేని పరిస్థితి.. రామ్ సాయం చేశాడు.. ఛార్మి!

By tirumala ANFirst Published Sep 28, 2019, 5:41 PM IST
Highlights

డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత పూర్వ వైభవాన్ని తిరిగి పొందారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, పూరి సత్తాని మరోమారు బయట పెట్టింది. ఈ చిత్రం పూరీజగన్నాధ్ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది. 

పూరీజగన్నాధ్ కు దర్శకుడిగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వేగంగా స్క్రిప్ట్ పూర్తి చేయడం.. అంతే వేగంగా షూటింగ్ ఫినిష్ చేయడం పూరి ప్రత్యేకతలు. పూరీజగన్నాధ్ టాలీవుడ్ టాలీవుడ్ లో ఓ మంచి సాంప్రదాయానికి తెరతీశారు. గత కొన్ని చిత్రాలుగా పూరీజగన్నాధ్ తో కలసి హీరోయిన్ ఛార్మి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

వీరిద్దరూ కలసి టాలీవుడ్ లో ఇబ్బందుల్లో ఉన్న దర్శకులని అందుకునేందుకు ముందుకు వచ్చారు. శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో 30 మంది దర్శకులకు, సహాయ దర్శకులకు రూ50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఛార్మి మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న దర్శకులని ఆదుకోవాలనే ఆలోచన పూరికి ఎలా వచ్చిందో ఛార్మి వివరించింది. 

పూరి జగన్నాధ్ నా వారసుడు అని దాసరినారాయణరావు గారు ఓ సందర్భంలో అన్నారు. దాసరి లాంటి లెజెండ్రీ దర్శకుడు నాకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నేను ఏం చేస్తున్నాను.. కేవలం సినిమాలు తీయడం.. హిట్లు కొట్టడం మాత్రమే నా పనా అని భావోద్వేగానికి గురయ్యారు. అలా కొందరు దర్శకులనైనా ఆదుకోవాలనే ఆలోచన పూరికి గతంలోనే వచ్చింది. 

కానీ ఆ సమయంలో మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం ముందువరకు చేతిలో 50 వేలు కూడా లేవు. ఈ సందర్భంగా హీరో రామ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. ఒకరకంగా పూరి జగన్నాధ్ ని, నన్ను ఆదుకున్నది హీరో రామే. పూరి ఫ్లాపుల్లో ఉన్నాడు.. కథ ఏంటి ఇలా విషయాలు ఏమీ ఆలోచించకుండా ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఒప్పుకున్నాడు అని ఛార్మి తెలిపింది. 

మనదగ్గర ఇవాళ డబ్బులు లేకపోవచ్చు.. ఆరోగ్యంగా ఉంటే చాలు.. నేను కథలు రాస్తా.. ప్రొడక్షన్ నువ్వు చూసుకో.. సక్సెస్ ఏదోఒక రోజు తప్పకుండా వస్తుంది అని పూరి తనతో అన్న మాటలని ఛార్మి గుర్తు చేసుకుంది. 

click me!