బిగ్ బాస్2: నూతన్ నాయుడు ఎలిమినేట్ కానున్నాడా..?

By Udayavani DhuliFirst Published 2, Sep 2018, 12:19 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్2 ముగింపు దశకు చేరుకునేకొద్దీ షోపై ఆసక్తి మరింత పెరిగేలా బిగ్ బాస్ టాస్క్ లను ఇస్తున్నాడు. కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ అయ్యేలా చేసి కౌశల్ ఆర్మీకి పెద్ద పనే చెప్పారు. 

బిగ్ బాస్ సీజన్2 ముగింపు దశకు చేరుకునేకొద్దీ షోపై ఆసక్తి మరింత పెరిగేలా బిగ్ బాస్ టాస్క్ లను ఇస్తున్నాడు. కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ అయ్యేలా చేసి కౌశల్ ఆర్మీకి పెద్ద పనే చెప్పారు. ఇది ఎవరూ ఊహించలేదు. తాజాగా హౌస్ లో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుందని సమాచారం. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే కామన్ మ్యాన్ గణేష్ హౌస్ నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.

కౌశల్ సేవ్ అయినట్లుగా నాని ప్రకటించడంలో మిగిలిన ముగ్గురు హౌస్ మేట్స్ లో అమిత్, నూతన్ నాయుడు, సామ్రాట్ లలో ఒకరు బయటకి వెళ్లనున్నారు. అయితే నిన్నటివరకు అమిత్ హౌస్ నుండి వెళ్లిపోయే ఛాన్స్ ఉందనే మాటలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఊహించని రీతిలో నూతన్ నాయుడు ఎలిమినేట్ అయినట్లు చెబుతున్నారు.

హౌస్ నుండి ఇదివరకే ఎలిమినేట్ అయిన నూతన్ రెండు సార్లు ఎంట్రీ ఇవ్వడం పట్ల హౌస్ మేట్స్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఓట్లతో పాటు హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రకారం నూతన్ ని బయటకి పంపినట్లు టాక్. మరేం జరుగుతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: సామాన్యుడు గణేష్ ఔట్!

'కౌశల్ ఆర్మీ'ని వాడుకుందామని కామెంట్స్ చేసిన గీతాపై నెటిజన్లు ట్రోలింగ్!

బిగ్ బాస్2: ఈ డ్రామాలేంటి..? బిగ్ బాస్ పై తనీష్ ఫైర్!

కౌశల్ కి ఉన్న ఏకైక అభిమాని నాని మాత్రమే.. బాబు గోగినేని కామెంట్స్!

బిగ్ బాస్2..ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్

Last Updated 9, Sep 2018, 12:01 PM IST