పవన్ బర్త్ డే.. సెలబ్రిటీల విషెస్!

By Udayavani DhuliFirst Published 2, Sep 2018, 11:34 AM IST
Highlights

సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. ఈరోజు అభిమానులు తమ అభిమాన హీరో కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పవన్ కి అభిమానులు ఉన్నారు. 

సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. ఈరోజు అభిమానులు తమ అభిమాన హీరో కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పవన్ కి అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా ఆయన్ని ఆరాధించే వారు చాలా మంది కనిపిస్తారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్వీట్లు మొదలయ్యాయి.

ప్రతి ఒక్కరూ పవన్ కి విషెస్ తెలుపుతూ ఆయనపై ప్రేమ కురిపిస్తున్నారు. ముందుగా మెగాఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్.. 'లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ మంచి సమాజం కోసం అన్నీ వదులుకొని మీరు చేస్తోన్న ప్రయత్నాలను ఆరాధిస్తున్నాను. మీరు చేస్తోన్న ఈ కృషి కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకుంది. వారందరి ప్రేమ మీకు ఎప్పటికీ ఉంటుంది. హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ బాబాయ్' అంటూ ట్వీట్ చేశారు.

వరుణ్ తేజ్.. 'హ్యాపీ బర్త్ డే బాబాయ్.. సమాజం పట్ల మీరు చూపించే ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం' అంటూ విషెస్ తెలిపారు. సాయి ధరమ్ తేజ్, నితిన్, మంచు మనోజ్, అనీల్ రావిపూడి ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కి తమ విషెస్ ని తెలిపారు. 

 

 

Last Updated 9, Sep 2018, 12:46 PM IST